ఆరంభము

శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి.౧౩౫/౨౦౨౦),

౩౧ కోట్ల సంవత్సరముల ఆధ్యాత్మిక, పౌరాణిక, సాంస్కృతిక, నాగరికతల ఇతిహాసిక పుణ్యక్షేత్రముగా, మహాసామ్రాజ్యముల ఇతిహాస రాజధానిగా చరిత్రకలిగిన ఈ దివ్య భూమి కైలాసమునుంచి పరశివుడు శ్రీ పంపావిరూపాక్షస్వామివారిగా వెలసిన పుణ్య భూమి  సప్త ఋషుల సాన్నిధ్యముతో, సత్యసంధుడు శ్రీ సత్యహరిశ్చంద్రుడు, త్రేతాయుగమున ధర్మమూర్తి  శ్రీరామచంద్రుడు నడియాడి ధర్మసామ్రాజ్యమును స్థాపించిన ధర్మభూమిగా, శ్రీ కెశరి, అంజనాదేవి, శ్రీ జాంబవంత, వాలి,  సుగ్రీవ, హనుమ, అంగదాది, తారా, శబరి  మహాభాగవతులు  జన్మించిన,  హేమకూట, అంజనాద్రి, ఋష్యమూక, మాతంగ, గంధమాదన పర్వతముల పవిత్ర  “కిష్కింధా సామ్రాజ్య” శ్రీ హనుమంతునిజన్మ భూమిగా,  భక్తిభూమిగా, ద్వాపరయుగమున పంచపాండవులను పునీతముచేసిన పుణ్య భూమిగా, కలియుగమున వేదవ్యాస భగవానుల, శ్రీ విద్యారణుల వారి విద్యా, విజయనగర సామ్రాజ్య ఆధ్యాత్మ భూమిగా కృష్ణదేవరాయల కర్మ భూమిగా ప్రసిద్ధినొందిన ఈ పవిత్రక్షేత్రము ప్రస్తుత కలియుగమున కలిప్రభావమున కొల్పొయిన పూర్వవైభవమును భగవంతుని కృపతో, ప్రేరణతో సంకల్పముతో భవబంధనములనుండి ముక్తికలిగించు భగవంతుడె లక్ష్యముగా, దానికి సాధనము భక్తిగా మహాభాగవతులు నడిచిన దారియందే సమస్త భగవద్భక్తులుకై భగవంతునిచే నిర్మింపబడి  తన ౩౧ కోట్ల సంవత్సరముల పూర్వ వైభవమును పున: సంతరించుకొంటున్న ఈ సామ్రాజ్యము భక్తినగర సామ్రాజ్యము, ఆట్టి ఈ ౩౧ కోట్ల సం. పంపాక్షేత్ర, ౧౭ లక్ష సం “కిష్కింధా సామ్రాజ్య” ౭౦౦ సం|| ల విద్యా,  ౪౦౦ సం|| ల  విజయనగర సామ్రాజ్యముల రాజధాని అయిన ఈ పావన పుణ్య భూమి  పున:జీర్ణోద్ధార కార్యక్రమములు ఆ పరమాత్మ ప్రేరణతో జగద్గురువుల ఆశీర్వాదముతో పరమపూజ్య శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారి మార్గదర్శనమున ౭ సంవత్సరములు క్రింద ఆరంభమై  త్రేతాయుగమున  ఏధర్మమూర్తి ధర్మస్థాపనకై అయోధ్యనుండి ఇచ్చటకు వచ్చి జాంబవంత, వాలి, సుగ్రీవ, హనూమంత, అంగద, శబరీ ఇత్యాది మహభాగవతులను ఉద్ధరించి తన ప్రియమైన హనుమంతుని చిరంజీవిగజేసి  భవిషత్ కల్పబ్రహ్మగా ఆశీర్వదించిన శ్రీరామదూత ఐన శ్రీ హనుమంతుని జన్మస్థలమైన ఈ పుణ్యభూమియందు తుంగభద్రా నదీ, పంపాసరోవర ,తటమునందు పవనపుత్రుని పవిత్ర 215 మీటర్ విగ్రహ దేవస్థాన నిర్మాణము,  భవిష్యత్ బ్రహ్మకై భగవంతుని స్ఫురణతో భక్తులచే భక్తితో నిర్మించు “భక్తినగరసామ్రాజ్య’ మహానిర్మాణము,

ఈ మహా కార్యమునకు శ్రీ విరూపాక్షుని, శ్రీరామచంద్రుల, శ్రీ హనుమంతుల  ప్రేరణతో, జగద్గురువుల అనుగ్రహముతో  పరమ పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి మార్గదర్శనమున సమస్త పంపాక్షేత్ర కిష్కింధా జీర్ణోద్ధారకార్యక్రములు ఆరంభమై ౨౦౧౩ న కాలగర్భములో కనుమరుగైన హంపి విజయనగరము అదే పంపాక్షేత్రమున నూతన స్వర్ణహంపి గ్రామమునకు శుభ శంకుస్థాపన చేసి వివిధ ఉత్సవములను ఆరంభించి పవిత్ర క్షేత్ర పరిరక్షణకై జరుగుతున్న కార్యక్రమములలో ప్రస్తుతము కిష్కింధా నగర సంపూర్ణా జీర్ణొద్ధారకార్యక్రమములు, మరియూ అయోధ్య – శ్రీ కిష్కింధా క్షేత్రముల పూర్వవైభవమును పున: నిర్మించుటకై శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(రి) ఆరంభింపబడి గత కొద్ధి సంవత్సరములుగాఅనేక కార్యరమములు జరుగుచున్నవి