తీర్థ క్షేత్ర ట్రస్ట్

కలియుగమున సకల జీవుల జన్మ సార్థక్యానికి భగవత్ప్రాప్తికి సోపానము భక్తి మాత్రమే అటువంటి భక్తిద్వారా భగవత్ప్రాప్తిని అనుగ్రహమును పొందిన వారిలో మహాభాగవతులలో శ్రీ హనుమంతులవారు పరమఉత్కృష్టులు  రామ భక్తికి మూర్తి స్వరూపము, శ్రీరాముని సేవలో తను తరిస్తూ భవిష్యత్తులో సకల మానవాళికి ఆ భక్తిని నేర్పించిన శ్రీరామనామమును తన రోమరోమమున నింపుకుని సకల జగత్తుని ఉద్దరించు తరక మంత్రమును శ్రీరామ నామ అమృత రసమును లోకమునకు తెలియజెప్పిన సాక్షాత్ భక్తిసాగరము, జ్ఞాన సాగరము, జితేంద్రియుడు,వానరశ్రేష్ఠుడు, అయిన శ్రీ హనుమంతులవారు భవిష్యద్ బ్రహ్మగా సకల జీవరాశులయొక్క లలాటములను లిఖించు బ్రహ్మగా కలియుగమున అంధకార కలిప్రభావముతో అనాదిమాయలో ఉన్న జీవుల ఉద్దారమునకై  భగవంతుని సేవ ఏ విధముగా చేయవలెనో అటువంటిసేవా కార్యమును కిష్కింధా యందు నిత్య సాన్నిధ్యముతో సకల భక్తులను అనుగ్రహిస్తూ శ్రీ హనుమంతులవారు  చిరంజీవులులై ఉనారు

అజ్ఞానమున ఉన్న మనకు భక్తి ఈమిటో, భగవంతుడు ఎవరో, భగవంతునికి ఏవిధముగా సేవచేయవలెనో దేనిని ఆశ్రయిస్తే సద్గతి కలుగునో భగవత్ప్రాప్తి దర్శనము కలుగునో వీటన్నిటికీ ఆ శరణాగతి ఒక్కటే మార్గముగా మనము ఆహనుమంతునే శరణువేడిన ఆయన ఈ జీవులను ఉద్దరించుటకు ఆయన సేవచేస్సుకొని మన జీవితములను ధన్యము చేసుకొనుటకు

ఆ శ్రీరామ చంద్రుని ప్రాణమైన శ్రీహనుమంతుని దాసానుదాసునిగా ఆ హనుమంతులవారికి సేవచేసుకొనుటకు ఆయన జన్మించిన క్షేత్రమున ఆ కేసరీ అంజనాదేవి అనుగ్రహముతో ఈ క్షేత్రమున శ్రీ హనుమంతులవారికి దివ్యమైన దేవస్థానము నిర్మించుటకు తద్వారా ఈ ప్రపంచమున భక్తి ప్రచారము చేయుటకు, ఇచటకు వచ్చుసమస్త భక్తులకు భగవద్ దివ్య సాన్నిధ్యమును ప్రసాదించు రీతిగా నిత్య శ్రీరామ నామ దివ్య సంకీర్తనలతో ఈ క్షేత్రమునకు వచ్చు ప్రతీ భక్తునికి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహము కలుగు రీతిగా ఈ దివ్య క్షేత్రమును ఇంకా ఇతో అభివృద్ధి చేయురీతిగా ఆ హనుమంతులవారి కృపతో మాత్రమే భగవద్ సేవకై భక్తుల సేవకై  సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి)