లక్ష్యములు

కలికల్మషముల సంచయ ప్రభావమునుండి “శ్రీ పంపాక్షేత్ర – కిష్కింధా – హంపి” రక్షణ, జీర్ణోద్ధార పువర్వైభవ, సమగ్ర అభివృద్ధి

సనాతన ధర్మ, భగవద్ భక్తి ప్రచార పరిరక్షణ, పంపాక్షేత్ర కిష్కింధా హంపి సంపూర్ణ జీర్ణోద్ధార పునర్వైభవ నిర్మాణము

భగవంతునిని తమ దివ్య భక్తి తో సాక్షాత్కరించుకొన్న మహాభాగవతుల జన్మ స్థానము భగవంతుని – భక్తుల – దివ్య భక్తి సంగమ స్థానము
భక్తినగర సామ్రాజ్యము

భగవంతుని కృపతో ఈ పవిత్ర క్షేత్రము జీర్ణోద్దార కార్యక్రమములలో భగముగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధికార్యక్రమములు అధ్యాత్మిక అధిభౌతిక, అది దైవిక అన్నివిధముల స్థాయిలలోనూ అభివృద్ధి పొందువిధముగా ఈ పవిత్ర క్షేత్రమును గురిచి సంపూర్ణముగా అష్ఠాదశపురాణములలో ఒక టైన శ్రీ స్కాంధపురాణమునందు సప్తఋషిప్రకాశికా యాత్ర – శ్రీ హేమకూటఖండమున విపులముగా సవివరముగా వర్ణింపబడినది తదనుసారము ఈ క్షేత్రముయొక్క పవిత్రతను , మాహత్యమును, మహాసామ్రాజ్యముల మహారాజధానిగా ప్రసిద్ధిపొందిన ఇతిహాసమును యథావత్తుగా కలియుగమునందు భగవత్ సాక్షాత్కారానికి, భగవద్ భక్తుల పాలిట కామధేనువుగా మహాభాగవులు జన్మస్థలమును కిష్కింధా క్షేత్రమున అనేక భగవద్ కైకర్యమునకై వివిధ కార్యక్రమములు ఆరంభింపబడినవి అందు కొన్ని నిర్థిష్థ లక్షములతో ఒక ప్రణాళికా భద్దముగా బృహద్ ప్రణాళిక నిర్మాణమై గతకొన్ని సంవత్సరములు గా అనేక కార్యములు అరంభమయ్యినవి అందు కొన్ని అభివృద్ధి కార్యములు, వివరములు,

ప్రపంచములో నే శ్రీ హనుమంతులవారికి అతి ఎత్తైన”౨౧౫” మీటర్ల”

శ్రీ హనుమద్ ”భక్తి వైభవ” విగ్రహ దేవస్థానము ౫౦ ఎకరములలో నిర్మాణము

అయోధ్యా- కిష్కింధా క్షేత్రముల పునర్వైభవము –
ప్రతి సం. కిష్కింధ నుండి అయోధ్యకి విశేష యాత్ర (౨౦౧౭,౨౦౧౮,౨౦౧౯)

శ్రీ కిష్కింధా భక్తి ప్రచార రథ నిర్మాణము( ౪౦ లక్షల రూ. లతో

శ్రీ రామనవమీ, శ్రీ రామ మహా సామ్రాజ్య పట్టాభిషెకం,
శ్రీ సీతానవమీ, శ్రీ హనుమద్ జయంతి, విజయోత్సవములు
శ్రీ  కిష్కింధా వైభవం,
శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ,

శ్రీ కిష్కింధా శ్రీ భక్తహనుమాన్”భక్తి వైభవ మందిరం – నమూనా

భగవత్ ప్రసాదము
( నిత్యాన్నదాన భగవత్ ప్రసాద వితరణము)

“కిష్కింధ రథా యాత్ర “౨౦౨౦-౨౪” శ్రీ హనుమంతుడి రామభక్తి వైభవ యాత్ర –
విజయదశమి(౨౬-౧౦-౨౦౨౦) రోజున యాత్ర ప్రారంభమవుతుంది –
పంపక్షేత్ర కిష్కింధ స్వర్ణ హంపి, (కర్ణాటక), కిష్కింధ నుండి
అయోధ్య నుండి జనక్పురి (నేపాల్)

  • భక్తి నివాస యాత్రికులకు ౧౦౯ గదుల భక్తినివాస ఏర్పాటు
  • భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము”
  • సంపూర్ణ రామాయణము, చిత్రముల ఉద్యానవన నిర్మాణము,