Trust Details

అజ్ఞానమున ఉన్న మనకు భక్తి ఈమిటో, భగవంతుడు ఎవరో, భగవంతునికి ఏవిధముగా సేవచేయవలెనో దేనిని ఆశ్రయిస్తే సద్గతి కలుగునో భగవత్ప్రాప్తి దర్శనము కలుగునో వీటన్నిటికీ ఆ శరణాగతి ఒక్కటే మార్గముగా మనము ఆహనుమంతునే శరణువేడిన ఆయన ఈ జీవులను ఉద్దరించుటకు ఆయన సేవచేస్సుకొని మన జీవితములను ధన్యము చేసుకొనుటకు

ఆ శ్రీరామ చంద్రుని ప్రాణమైన శ్రీహనుమంతుని దాసానుదాసునిగా ఆ హనుమంతులవారికి సేవచేసుకొనుటకు ఆయన జన్మించిన క్షేత్రమున ఆ కేసరీ అంజనాదేవి అనుగ్రహముతో ఈ క్షేత్రమున శ్రీ హనుమంతులవారికి దివ్యమైన దేవస్థానము నిర్మించుటకు తద్వారా ఈ ప్రపంచమున భక్తి ప్రచారము చేయుటకు, ఇచటకు వచ్చుసమస్త భక్తులకు భగవద్ దివ్య సాన్నిధ్యమును ప్రసాదించు రీతిగా నిత్య శ్రీరామ నామ దివ్య సంకీర్తనలతో ఈ క్షేత్రమునకు వచ్చు ప్రతీ భక్తునికి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహము కలుగు రీతిగా ఈ దివ్య క్షేత్రమును ఇంకా ఇతో అభివృద్ధి చేయురీతిగా ఆ హనుమంతులవారి కృపతో మాత్రమే భగవద్ సేవకై భక్తుల సేవకై  సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి)

పరమ పూజ్య జగద్గురు శంకరాచార్యుల, శ్రీ రామానుజ,  శ్రీ ధ్వాచార్యుల  పరంపరానుగత  వైదిక ధర్మాచార్యుల మార్గదర్శనములో పూజ్య  శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారు అధ్యక్షులుగా పూజ్య  శ్రీ స్వామివారి నేతృత్వములో కర్నాటకాలో పంపాక్షేత్రములొ  ముఖ్య కార్యాలయముగా  5 ఫిభ్రవరి్, 2020 వ తారీఖున ఆధీకృతముగా  ఆ హనుమంతులవారి కృపతో భగవద్, భక్తుల సేవకై  సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి) రిజి స్ట్రేషన్ చేయబడిన

ట్రస్ట్ మర్రిన్ని వివరములు లక్ష్యములు