Kishkindha

కిష్కింధా క్షేత్రము :
భారతదేశమున అత్యంత పవిత్రమైన దక్షిణ ప్రాంతములో క్షేత్రములలో పంపాక్షేత్రము 31 కోట్ల సంవత్సరములనుంది ప్రసిద్ధిపొందినది అందు ఆ పంపాక్షేత్రమునందు అంతర్భాగమే కిష్కింధా తుంగభద్రానదికి ఉత్తర తటమున ఋష్యమూక, మాతంగ ఇత్యాది అనేక పర్వతములతో, పంపాసరోవరము ముఖ్యముగా 41 సరోవర తీర్థములతో వానరుల యొక్క సామ్రాజ్యమై పరమేశ్వరుని,శ్రీరామ చంద్రుని, సూర్యుని,వాయుదేవుని, అనుగ్రహముతో ఇప్పటికీ కీ కూడా అదే 31 కోట్ల పంపాక్షేత్రమును, 17 లక్షల సంవత్సరాల ఆ రామాయణపు ఆనవాళ్ళు సజీవముగా కన్నులకు గోచరమగును, మాతాఅంజనా దేవి తపమాహరించి భగవద్ ప్రసాదంగా శ్రీ హనుమంతులవారిని కన్న దివ్య క్షేత్రము శ్రీ హనుమ జన్మక్షేత్రము

మాహాత్మ్యము :
భగవత్భక్తుల కు కల్పతరువు ఐన క్షేత్రములలో మహాభాగవతులకు పుట్టినిల్లు ఈ పంపాక్షేత్ర కిష్కింధా నగరము భగవంతునిని సాక్షాత్కరించ్హుకొనవలెనన్న, ఆయన అనుగ్రహమును పొందవలెనన్న భగవంతుని సాన్నిధ్యమునకు వెళ్ళి తపమాచరించుట ఇతిహాస పురాణములయందు ప్రసిద్ది కానీ ఆభగవంతుని సేవలోనిత్యమూ తరించవలెనని ఇంద్రాది లోకములలో ఉన్న సమస్థ దేవతలు వారు వారు వారి రూపములను మార్చుకొని కొందరు, వానరులుగా, కొందరు భల్లూకాలురా, లతలుగా, తీర్థములుగా, పర్వతములుగా, పశు పక్షాదులుగా, తమ తమ దివ్య శరీరములను కామశరీరముల రూపములో త్రేతాయుగమునందు శ్రీ రామను ఆగమనముకనై అనారాయణుని సేవకై ధర్మ సామ్రాజ్య స్థాపనకై వారి వారి రూపములను మార్చుకొని సమస్తదేవతలు ఇచ్చట ప్రకటితమైయ్యెను, అందు జాంబవంత, వాలి,శుగ్రీవ,హనుమ,అంగద, తారా, జాంబవతీ ఇత్యాది అనేక భాగవతోత్తముల జన్మ స్థానము ఈ కిష్కింధా నగరము అటువంటి నగరమును దర్శించి తన భక్తులను అనుగ్రహించుటకు త్రేతాయుగమున శ్రీ రాముల వారు తన పాదస్పర్శతో పునీతమైనక్షేత్రము ఈ పంపాక్షేత్రము అందుకలే శ్రీ వాల్మీకి మహర్షులవారు వారి శ్రీ మద్వాలీకి రామాయణమునందు ౩ కాండముల ఈ క్షేత్రమునకే సంబంధిచినవి వనవాస, కిష్కింధా, సుందరకాండ, ఇచ్చట వైభవమును తెల్పును

శ్రీరాములవారి ఆగమనము
శ్రీమన్నారాయణుడే త్రేతాయుగమున ధర్మసంస్థాపనమునకై అవతరించిన సాక్షాత్ ధర్మమూర్తి శ్రీరామచంద్రులవారు, త్రేతాయుగమున అసురుల సంహారమునకై భగవద్భక్తులను రక్షింప వారిని అనుగ్రహించుటకై సౌమిత్రీ సహితుడై కాలినడకన అనంత సూర్యతేజోకాంతివిరాజమానుడై ఈ పంపాక్షేత్ర కిష్కింధా నగరమునకు తన మహాభాగవతోత్తములను అనుగ్రహించుటకు ఇచ్చటకు వచ్చెను,

స తాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల ఝషాకులామ్,
రామః సౌమిత్రి సహితో విలలాప ఆకులేన్ద్రియః,                   1

తస్య దృష్ట్వైవ తాం హర్షాత్ ఇన్ద్రియాణి చకమ్పిరే,
స కామ వశమ్ ఆపన్నః సౌమిత్రిమ్ ఇదమ్ అబ్రవీత్ ,         2

సౌమిత్రే శోభతే పంపా వైడూర్య విమలోదకా,
ఫుల్ల పద్మోత్పలవతీ శోభితా వివిధై: దృమై:,                    3

సౌమిత్రే పశ్య పమ్పాయాః కాననం శుభ దర్శనమ్,
యత్ర రాజన్తి శైలాభా ద్రుమాః స శిఖరా ఇవ,                     4

శ్రీ మద్వాల్మీకి రామాయణము

శ్రీ మద్వాల్మీకి రామాయణము నకు సమస్త కార్య క్షేత్రములు  హృదయము, ఈ కిష్కింధా నగరమే, ఇచ్చట వైభవమే శ్రీ రామాయణ వైభవము, ఇచట జన్మించిన హనుమదాది సమస్త మహాభాగవతోత్తములు శ్రీరాముని సేవతో తరించిన వారి యొక్క భక్తిసాగర హృదయాంతరంగమే శ్రీమద్వాలీకివారి హృదయమునుండివెలువడిన దివ్య గానామృతమే తల్లి సీతా సమేత శ్రీ రామచంద్రులవారి దివ్య చరితమే శ్రీ మద్వాల్మీకి రామాయణము కలియుగమందు సమస్త ప్రాణికోటికి భవౌషద తారకమే శ్రీ మద్వాల్మీకి రామాయణము శ్రీ మద్వాల్మీకి రామాయణము నకు సమస్త కార్య క్షేత్రములు  హృదయము, ఈ కిష్కింధా నగరమే,

ప్రథమ సర్గ:

స తాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల ఝషాకులామ్ | రామః సౌమిత్రి సహితో విలలాప ఆకులేన్ద్రియః  1
తస్య దృష్ట్వైవ తాం హర్షాత్ ఇన్ద్రియాణి చకమ్పిరే | స కామ వశమ్ ఆపన్నః సౌమిత్రిమ్ ఇదమ్ అబ్రవీత్   2
సౌమిత్రే శోభతే పంపా వైడూర్య విమలోదకా | ఫుల్ల పద్మోత్పలవతీ శోభితా వివిధై: దృమై:    3
సౌమిత్రే పశ్య పమ్పాయాః కాననం శుభ దర్శనమ్ | యత్ర రాజన్తి శైలాభా ద్రుమాః స శిఖరా ఇవ   4 ,  ఈ విధముగా ఆరంభించి

సప్త షష్టితమ స్సర్గ:

ఉత్పతద్భి ర్విహంగై శ్చ విద్యాధర గణైర౭పి |  త్యజ్యమాన మహా సానుః సంనిలీన మహోరగః    49
శైల శృ౦గ శిలో ద్ఘాత స్తదా౭భూత్ స మహా గిరిః  50
నిశ్శ్వసద్భి స్తదా తై స్తు భుజగై: అర్ధ నిస్సృతైః |  సపతాక ఇవ ఆభాతి స తదా ధరణీ ధరః  51
ఋషిభి స్త్రాస సంభ్రాన్తై స్త్యజ్యమానః శిలోచ్చయః |  సీదన్ మహతి కాన్తారే సార్థ హీన ఇవ అధ్వగః  52
స వేగవాన్ వేగ సమాహితా౭౭త్మా    హరి ప్రవీరః పర వీర హన్తా |  మనః సమాధాయ మహానుభావో  జగామ ల౦కామ్ మనసా మనస్వీ     53,
ఇత్యార్షే శ్రీమద్రామాయణే, ఆది కావ్యే, శ్రీమద్వాల్మీకీయే,  చతుర్వింశతి సహస్రికాయాం సంహితాయాం, శ్రీమత్  కిష్కింధా కాండే…….ఈ విధముగా సప్త షష్టితమ స్సర్గ  లతో కూడుకొనిన భగవంతుని చరితము, సమస్త ధర్మములను తెలుపు, భక్తిని,భగవద్భక్తిని, భగవద్భక్తుని దాని మహిమను,  నిరూపించు శ్రీ మద్వాలీకి,  రామాయణ హృదయము శ్రీ మద్వాల్మీకి రామాయణము నకు సమస్త కార్య క్షేత్రములు  హృదయము, ఈ కిష్కింధా నగరమే,