Sanatana Dharma

“ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠా” 

ఈ సమస్త సృష్ఠి దేనిపైన ఆధారపడి ఉన్నదో సమస్త ప్రాణూలు దేనిని ఆచరించిన వారి జీవనము జన్మ పరిపూర్ణము నొందునో ఈ సమస్త సృష్టి, స్థితి, లయములకు ఏదికారణమో మరియూ ఏది అనాదికాలముగా సమస్తమునూ సృజించి రక్షించుచున్నదో సమస్త ప్రాణులు ఏది ధరించుటకు యోగ్యమో దేని రక్షణకై భగవంతుడు అవతారములు పొందునో, అనాదికాలముగా ఆయా కల్పముల యందు, మన్వంతరముల యందు, యుగముల యందు, సమస్త జ్ఞానులు, ఋషులు, తపస్సంపన్నులు దేనిని ఆధారముగా చేసుకొని జీవించిరో, దేనిపైన సమస్త దేవతలు ప్రతిష్ఠితమై ఉన్నారో, ఏది త్రికాలములలో శాశ్వతముగా ఉండునో, సర్వమునకూ ఏది మూలమో ఆధారమో, కారణమో, దానినే సనాతనముగా సనాతన ధర్మముగా, వర్ణాశ్రమ ధర్మముగా అపౌరుషేయములైన వేదములు పేర్కొను చున్నవి, అట్టి సనాతన ధర్మములను ఆధర్మ ఆచరణ ధరించు శ్రేష్ఠ విధానములను, తత్ఫలితములను సకల మానవాళికీ తెలుపు నవి “శృతులు” వీటినే వేదములు అని అందురు వీటి ఆచరణను సమూలాగ్రముగా తెలియ జేయునవి స్మృతులు, ఈ ధర్మములనే ఇంకనూ ఇతిహాస ప్రమాణములతో భగవంతుని అనేక అవతార విశేషములతో, సత్పురుషుల, మహర్షుల జీవన ఇతిహాస విశేషముల తో తెలుపునవి ఇతిహాస పురాణ, దివ్య కావ్యములు సమస్తమూ ధర్మము పైనే ఆధారపడి ఉన్నవి ఆ సనాతన ధర్మము అనాది కాలము గా భూమండలం పైన సమస్త సనాతనులు ఆచరింప వస్తున్న ఆచరణ కర్మ ఆనుష్ఠానములకు మూల స్థానము ఈ భారత దేశము  ఇటివంటి భారత దేశమున ఆ సనాతన ధర్మ పరిరక్షణకు భగవంతుడు ఆయా యుగములయందు ( మస్త్య కూర్మ ఆది వామన, పరశురామ, శ్రీరామ, శ్రీ కృష్ణ, కల్కి ఆది) అవతారములను ధరించి ధర్మ పరిరక్షణ చేసి సమస్త ప్రాణులను ఉద్దరించును ఆ భగవంతుని అవతారములయందు తాను అవతరించిన తన దివ్య లీలలను ప్రకటించిన, ఆ భగవంతుని లీలావతార విషేశములను దర్శించుటకై వేల సంవత్సరములుగా అనేక దేవతలు, ఋషులు తప్పస్సు చేసిన ఆభగవంతుని సేవకై, సేవలో తమ జీవితములను సార్థకము చేసుకొనుటకు అవతరించిన మహాభాగవతుల జన్మ స్థానములలో మోక్ష ధామములలో ప్రసిద్ధమైన శ్రీ అయోధ్యా, శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా దివ్య ధామములు భగవంతుని నిత్య సన్నిధానమునకు అధ్యాత్మిక పుణ్య క్షేత్రములకు రాజధానులు దివ్య భగవత్- భక్తుల సంగమ క్షేత్త్రములు అటువంటి ధర్మ మూర్తి అయిన శ్రీ రామ చంద్రుని దివ్య జన్మస్థలము, మోక్షపురులలో ప్రప్రథమమైన మోక్షపురి “అయోధ్యా” క్షేత్రము, అటువంటి ధర్మమూర్తి భగవంతుడైన శ్రీ రామచంద్ర మూర్తి నిరంతర సేవలో తరించుటకై భగవద్ భక్తులలో స్రేష్ఠులు మహాభాగవతులలో అగ్రగణ్యులు ఐన శ్రీ పరమేశ్వరుని అంశతో, వాయువుని అనుగ్రహముతో, సూర్యాంశ తేజో సంభూతుడై కేసరీ అంజనాదేవి దంపతులకు శ్రీ పంపాసరోవరమున అంజనాద్రి పర్వతమున  జన్మించిన దివ్య క్షేత్రము “పంపాక్షేత్ర కిష్కింధా” క్షేత్రము సనాతన ధర్మమునకు భగవంతుని నిత్య సాన్నిధ్యమునకు మూల సన్నిధానము భగవద్ భక్తుల దివ్య సంగమక్షేత్రము    

పంపాక్షేత్ర కిష్కిధా హంపి –సంపూర్ణ పునర్వైభవ కార్యక్రమము

ముందుమాట – Introduction

సనాతన ధర్మము


సనాతన ధర్మము, త్రికాలములలో శాశ్వతమైనది, అనాదియైనది, అంత్యము లేనిది, సకల కారణములకు కారణమైనది,
సనాతన పురుష స్వరూపమైనది, జ్ఙాన స్వరూపమైనది, శృతుల యందు సుప్రతిష్ఠితమైనది, సమస్త సృష్ఠి, స్థితి లయలకు, సమస్త ప్రాణులకు వాటి శ్రేయస్సుకు ఆధార వర్ణాశ్రమ స్వరూపమైనది, సమస్త జీవుల జీవన లక్ష్య సాధనకు ఎకైక శ్రేయో మార్గమైనది, అట్టి ఈ సనాతన ధర్మమునకు  భగవత్ స్వరూపమైన వేదములు మూలములు,   అట్టి వేదములకు నిత్య సాన్నిధ్య  స్థానములు, మూలములు ఋషులు,  ఋషుల హృదయములు , అట్టి ఋషుల, మహర్షుల, మునుల సాధనా స్థలములు, దివ్య తీర్థ క్షేత్రములు, అట్టి దివ్య తీర్థ క్షేత్రముల, నిత్య భగవత్ సాన్నిధ్యముల దివ్య దేశము ప్రదేశము – భరత వర్షము అట్టి భరత వర్షమున దివ్య పర్వత, సరోవర, తీర్థ, ఋషి, భగవత్ నిత్య సాన్నిధ్య,  క్షేత్రములలో ఉత్తమ తీర్థ  క్షేత్రము  పరిపూర్ణా క్షేత్రము – పంపాక్షేత్రము
___

  • అట్టి సనాతన ధర్మమునకు, ఋషులకు, జ్ఞాన సంపదలకు మూలస్థానము మైన భారతదేశమున ఈ వుణ్య దివ్య భూమి నిత్య భగవంతుని సాన్నిధ్య  అనుగ్రహముతో “పంపాక్షేత్ర”ముగా ప్రకాశింపచేస్తున్నది,
  •  అటువంటి క్షేత్రములలో ఉత్తమ మైనది శ్రీ పంపాక్షేత్రము, భరత వర్షములో దక్షిణ పథమున తుంగభద్రా నదీతటమున శ్రీ హేమకూట, మాతంగ, ఋష్యమూక, కిష్కింధా, మాల్యవంత ఇత్యాది పర్వత రాజములచే సకల తీర్థములలో తీర్థరాజ క్షేత్రముగా మకుఠాయమానంగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రము, “పంపాక్షేత్ర”ము
  • 31 కోటి సంవత్సరాల దివ్య ఆధ్యాత్మిక, పౌరాణిక, ఐతిహాసిక ధామము ఈ పంపా క్షేత్రము,
  • దక్షయజ్ఙము తరువాత పరమ శివుడు తను కైలాసమును వదలి ఏకాంతముగ తపమాచరించుటకు భూలొకమున ఇచ్చటకు వచ్చ్చి దివ్య హేమకూట పర్వతముపైన  తపమాచరించిన శ్రీ పరమశివుని తప:స్థలము, పరాత్పరుడైన పరమ శివుడు తన ప్రచండ మూడవ నేత్రము తెరచిన శ్రీ విరూపాక్షుని తేజో దివ్య ధామము ,
  • 17లక్షల సం త్రేతాయుగపు శ్రీ రామాయణ కిష్కింధా నగర సామ్రాజ్య రాజధాని శ్రీ జాంబవంత,  వాలి, సుగ్రీవ శ్రీహనుమంత, శ్రీ అంగద, నల, నీల ఇత్యాది మహా భాగవతుల జన్మ స్థానము, ధర్మ స్థాపనకై, అసురుల సంహారమునకై  శ్రీ మహావిష్ణువు శ్రీ రామ అవతార రూపములో భూలోకమున అయోధ్య క్షేత్రమునందు అవతరింఛి న ధర్మమూర్తి,  అటువంటి ఆ ధర్మమూర్తి పాదస్పర్శతో  పులకించిన ప్రకృతి సౌందర్యముల పావన పుణ్య భూమి, రావణ సంహారమందు శ్రీ రామ చంద్రునికి  సహాయమొనర్చ  వహింప సకల దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాది దేవతలు తమ లోకములను వదలి వానర, జల, భూ చర, లతల, పర్వతముల, రూపములో ఇచ్చట వెలసిన సమస్త దేవతల సాన్నిద్యముతో పావనమైన భూమి ఈ పంపాక్షేత్ర కిష్కింధా దివ్య భూమి, రాబోవు కలికాలమున ధర్మపరిరక్షణకు, భగవద్ భక్తులకు జగద్రక్షగా, భవిషత్ బ్రహమగా తన బంటును శ్రీ హనుమంతుని చిరంజీవిగ ఆశీర్వదించిన, శ్రీఅంజనీసుత హనుమంతుని మరియూ ఇచ్చట పుట్టిన సమస్త వానరులు శ్రీరామ కార్యములో లో తమ జీవనములను సార్థకము చేసుకొన్న మహా భాగవతుల జన్మస్థలము  శ్రీరామాయణము  కాలమునాటి కిష్కింధా దివ్య క్షేత్రము ,
  • జగద్గురు విద్యారణ్య , ఆచార్యుల మార్గదర్శనములొ ఎందరో వీర క్ష్యత్రియుల క్షాత్ర శౌర్యములకు, మహాసామ్రాజ్య సామ్రాజ్య్తములకే మకుటాయమానముగా ఎందరో విజయ వీరుల వైభవ గాధలను తెలిపే చతుర్వేద భాష్యములనుండి, శాస్త్ర కళల, కవిసార్వభౌముల భువన విజయముల సరస్వతీ జ్ఞాన ఉపాసనా సామ్రాజ్యరాజధానిగా సమస్త విద్యల, విద్వాంసుల ఆష్ఠదిగ్గజముల విద్యా, విజయనగర సామ్రాజ్య వైభవ భూమి, ఇక్కడ ఉన్న ఒక్కోక్క శిల ఒక్కొక్క వైభవ ఇతిహాసాన్ని తెలియజేస్తాయి,
  • ఇలా ఎందరో దేవతల, మహా ఋషుల, మహాభాగవతుల, తపస్సంప్పన్నుల, ఆచార్యుల తపో ధామము,  ఎందరో మహారాజ చక్రవర్తులు ధర్మపరిరక్షణకై సేవించిన, పంపాక్షేత్ర విజయనగర వీదులలో రాశులు రాశులుగా వజ్ర, వైఢూర్య, గోమేధకాది, నవరత్నములను మాడ వీదులలో రాశులుగా రాశులుగా పోసిన  సిరి సంపదల దివ్య క్షేత్రము, వైభవమునకు పుట్టిన ఇల్లు, ఎందరో మహానుభావులు భగవత్ భక్తితో వారి దాసభక్తి తో వారి సంకీర్తనలతో పామరులకు కూడ భగవంతును తత్వమును తెలుప భగవత్ భక్తి కీర్తనలతో ఈ క్షేత్రమునే భగవంతుని సాక్షాత్కరించుకొనిన సాక్షాత్ పుష్పక విమానములో వైకుంఠమును పొందిన పురందర దాసు, కనకదాసు భక్తి కీర్తనలతో పులకించిన పుణ్య భూమి, 
  • 31 కోట్ల సంవత్సరాల దివ్య ఆధ్యాత్మిక, పౌరాణిక, రాజధాని
  • 17 లక్షల సంవత్సరాల త్రేతాయుగపు కిష్కింధా నగర సామ్రాజ్య రాజధాని
  • 700 ఐతిహాసిక మహా సామ్రాజ్య సామ్రాజ్యములకే మహా సామ్రాజ్య రాజధాని
  • కిష్కింధా విద్యా హంపి విజయయనగర సామ్రాజ్య రాజధాని
  • అధ్యాత్మిక, పౌరాణిక, సాంస్కృతిక, నాగరికత ల మహా సామ్రాజ్య సామ్రాజ్యములకే మహా సామ్రాజ్య రాజధాని  ఈ పంపాక్షేత్ర కిష్కింధా హంపి  విజయయనగర సామ్రాజ్య రాజధాని

ధర్మ పరిరక్షణ –  శ్రీ పంపాక్షేత్రము :

యుగ యుగాలనుంచి ఎప్పుడెప్పుడు ధర్మానికిగాని, మానవాళికిగాని, సాధుసజ్జనులకి, భగవత్ భక్తులకి గాని ఎటువంటి ఆపత్తులు, ఆపదలు వచ్చిన శ్రీ పంపావిరూపాక్షేశ్వరుని దివ్య అనుగ్రహముతో వాటన్నింటికీ పంపాక్షేత్రము నుండే ధర్మ రక్షణకు నాంది ఆరంభమగును, అసురుల సంహారమునకు శ్రీ విష్ణువు శ్రీ శువుని గూర్చి తపమాచరించిన స్థళము ఇదే ఆ మహా విష్ణువుయొక్క తపస్సును వేయ్యి కమలపుష్పముల పూజతో ప్రసన్నుడైన శివుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రమును  అనుగ్రహించిన దివ్య శ్రీ చక్రతీర్థము ఇచ్చటనే,
త్రేతాయుగమున శ్రీ మన్నారాయణుడు శ్రీ రాముల వారి రూపములో అసురుల సంహారానికి అవతారమెత్తిన పిదప అయోధ్యనుండి పంపాక్షేత్రమునకు వచ్చి శ్రీ విరూపాక్షుని ఆశీర్వాదముతో రావణుని సంహరించుటకు వానర సైన్యముతో ధర్మ రక్షణకై  విజయ యుద్ధమునకు బయలుదేరినది ఇచ్చటనుంచే, అటువంటి సమయమున బ్రహ్మ ఆదేశానుసారము సమస్త దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు శ్రీరామ సేవకై శ్రీరామ కార్యములో సహాయము చేయుటకు  శ్రీ జాంబవంత, శ్రీ వాలి, శ్రీ సుగ్రీవ, శ్రీ హనుమ, శ్రీ అంగద, నల నీల ఇత్యాదులు వానరుల రూపములో భూలోకములో వెలసినది ఈ పంపాక్షేత్రమునందే,

ద్వాపరయుగమున పాండవులు వారి రాజ్యమునుండి వంచితులైన వనవాసములో ఉన్న సమయమున భగవాన్ శ్రీ కృష్ణుని ఆశీర్వాదముతో కుంతీ దేవి ఆదేశానుసారము  పంచపాండవులు ఈ పంపాక్షేత్రమునకు వచ్చి శ్రీ క్షేత్రమును సేవించి అర్చించుకొని తిరిగి వారి శ్రీ రాజ్యమును ప్రాప్రించుకొన్నది విరూపాక్షుని ఆశీర్వాదముతోనే ,

ఇదేవిధముగా అసురుల, విదేశీ మ్లేచ్ఛుల దురాక్రమణలకు, అరాచకాలకి, కుటిల వంచనలకి మోసపూరిత కుట్రలతో మతాంతరాలతో హిందువులపై దాడి చేస్తున్న సమయమున జగద్గురు శ్రి విద్యారణ మహా స్వామివారు దేశ ధర్మ పరిరక్షణకు మెట్టమొదటి హిందూసామ్రాజ్యమును విద్యా, విజయనగర సామ్రాజ్యమును స్థాపించి ఏక ఛత్రాధిపత్యముగా రాజ్యమును పాలించిన అలనాటి సామ్రాజ్య రాజధాని శ్రి విద్యారణ వీర భూమి ఇదే

చరిత్ర : 

పంపాక్షేత్రము ౩౧ కోట్ల సంవత్సరాల వైభవ అధ్యాత్మిక, పౌరాణిక, సాంస్క్రుతిక, ఇతిహాసములలో కూడిన దివ్య మహా క్షేత్రము, అష్ఠాదశ పురాణాలలో  సప్రమాణముగా స్కాంధపురాణాంతర్గత శ్రీ హేమకూటఖండాత్మక శ్రీ సప్తర్షిప్రకాశికా యాత్ర శ్రీ పంపాక్షేత్ర మాహాత్మ్యము న  ఈ క్షేత్రమున గురించి సమగ్రముగా కాల, ప్రదేశ, స్థళ, వైశిష్ఠ్యాలతో కూడిన వైభవమును సంపూర్ణముగా తెలియ జేయు పురాణమును ౫౩౦౦ క్రితము సాక్షాత్ నారాయణ అవతారమైన భగవాన్ వేదవ్యాసులవారు కశీ క్షేత్రమునుండి ఇచటకు వచ్చి తుంగభద్రా నదీ తటమున శ్రీ ఋష్యమూక, మాతంగ పర్వతముల మధ్య వేదవ్యాస అశ్రమమును నిర్మించి సమస్త శాఖలతో కూడిన చతుర్వెద, సకల శాస్త్రముల విద్యా గురుకులమును ఆధ్యాత్మిక ఆశ్రమమును  కలియుగమున కలి ప్రభావముచే సమస్త ప్రాణుల రక్షణకై సాక్షాత్ వేదవ్యాసులు తపమాచరించిన తపో భూమి ఈ పంపాక్షేత్రము,

౩౧ కోట్ల సంవత్సరాల వైభవ అధ్యాత్మిక, పౌరాణిక, సాంస్క్రుతిక, ఇతిహాసములలో ఈ పంపాక్షేత్రము గురించి ప్రస్తుత మిడిమిడి జ్ఙానముతో ఉన్న నూతన సంశోధకులకి తెలిసినది  కేవలము సుమేరు శికర పర్వతములో ఒక చిన్న రేణువంత  ౭౦౦ సంవత్సరములు మాత్రమే,  అది వారి తప్పుకాదు  ప్రతీ విషయమును భౌతిక దృష్టినుంచే చూసే వారి మానవ మేథస్సుకు అందని అంతు చిక్కని నిగూఢ వైభవ రహస్యముల ౩౧ కోట్ల సంవత్సరాల నిధి దివ్య క్షేత్రము ఈ పంపాక్షేత్రము ,  

మూగబోయిన ఐతిహాసిక సాక్షాలు

శాశ్వత సామ్రాజ్యము :


వర్తమానమునరాజ్యములూ లేవు రాజులూ లేరు, ఎప్పుడైతే రాజులు ధర్మ పరిరక్షణ విధిని వదలి ధర్మ భ్రష్ఠులైరో అప్పుడే రాజులూ రాజ్యాలు వారి తేజోబలముము వర్ణ సంకరములై కాల గర్భములో కలసిపోయునవి, దీనికి ధర్మమును అనుసరించక, ఆచరించక పోవుటయే కారణము ప్రస్తుతము పరాశర మహర్షుల వచనముననుసరించి చోరులే రాజ్యములేలుచున్నారు, ధర్మ ప్రవృత్తిని విస్మరించుచున్నారు ధర్మమే, భగవంతుడే శాశ్వతమని తెలియలేకుండగా అధర్మ మార్గమున ప్రవర్తించుచున్నారు, నాస్తికులై, ప్రవర్తించుచున్నారు, ప్రజలను నాస్తిక మార్గములో వుండురీతిగా అధర్మపరాయణులైరి, ప్రస్తుత సమాజమున భగవంతుని, ధర్మమును మరచి అధోగతికి పోవు మునుపే  లోకకల్యాణమునకై మరల సమస్త మానవులకు భగవంతుని,ధర్మము యొక్క భక్తియొక్క కలియుగ ప్రభావమునుండి, అనేక విపత్తులనుండు మనులను మనము రక్షించుకొను విధముగా  ధర్మార్థకామమోక్ష సనాతన మార్గమున  త్రికాలములలో శాశ్వితముగా ఉందేడి భగవంతుని ప్రాప్తికై సమస్త భక్తులును కలిపే భక్తి మార్గమున శాశ్వతము శుభ సంపత్తులను ముందర తరములవారికి అందించుటకు దుష్టులచే కబళించడానికి సాధ్యముకాని, చోరులచే తస్కరించడానికి అలవికాని, మదమెక్కిన వైదేశీకుల మ్లేఛ్చుల కుటిలభుద్ధులతో ధ్వంసమయ్యే భౌతిక భవనములలో కాకుండగా, ఎవ్వరూ ఎటువంటి విధముగా నాశనముచేయుటకు అలవికాని సకలమానవాళికి అమృతరూపభగవద్ భక్తిని ప్రసాదించు భవిష్యత్ బ్రహ్మకై భగవద్ భక్తులచే నిర్మింపబడు భవ్య సామ్రాజ్యము భక్తినగర సామ్రాజ్యము,

ఏమి కోల్పోయినాము :


సనాతన హిందూ ధర్మము పట్ల , తీర్థక్షేత్రాల, దేవస్థానముల పై  కొంతమంది రాక్షసుల పైశాచిక, స్వార్ధపరుల కపటబుద్దికి వారి దురాగతాలకి సాక్షాలు……..యథా తథముగా ఎదురుచూస్తున్నాయి మరల పూర్వ వైభవమును సంతరించుకొనుటకు,

మన పూర్వికులు మనకి ఇచ్చిన వెలకట్టలేని ఎంతో అధ్యాత్మ, సాంస్క్రుతిక, నాగరికత సంపద ను కోల్పోయితిమి మరల ఆ పూర్వ వైభవమును పొందుటకు యుగ ధర్మమును అనుసరించి భగవద్ ప్రేరణతో ఇప్పటివరకూ ఏమి కోల్పోయినామో దానిని తిరిగి మరల పొండుట  

ప్రస్తుత కార్యము మన కర్తవ్యము :


నిరంతర దండయాత్రలతో కోల్పోయిన మన సంపదలను పున: నిర్మాణము , ఇదే స్పూర్తితో 2013 లో మూల హంపి నివాసులు క్షేత్ర గ్రామస్తుల కోరిక నివేదమేరకు శ్రీ పంపావిరూపాక్షేశ్వర స్వామివారి కృప స్ఫురణతో అలనాటి  వైభవము కనుమరుగు అవ్వకుండగా ఏమహానుభావులచే ౭౦౦ వందల సం క్రితము ధర్మ పరిరక్షణకై విద్యా, విజయనగర సామ్రాజ్యము స్థాపింపబడినదో ఆ మహాసారాజ్య రాజధాని విజయనగర సామ్రాజ్య రాజధాని ”హంపి” పునర్నిమాణ కార్యక్రమము పరమహంస పరివ్రాజక పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారి  అమృత హస్తములతో గ్రామ ప్రజల సహకారముతో నిరవేరి సంపూర్ణ శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా హంపి జీర్ణోద్ధార కార్యక్రమములు అరంభమైనవి

లక్షము :


కలికల్మషముల సంచయ ప్రభావము నుండి శ్రీ పంపాక్షేత్ర రక్షణ సంపూర్ణ క్షేత్ర  పునర్వైభవ నిర్మాణము, భక్తి ప్రచారము, భగవంతుని దివ్య సాన్నిధ్యమిలో భగవద్ భక్తియే ముఖ్యముగా సమస్త జీవరాసులకి వాటి జన్మ సార్థకమునకు భక్తియే పరమ సోపానముగా అట్టిభక్తితత్వముచే పూర్వము భగవంతుని సాక్షాత్కరించుకొన్న మహాభాగవతుల జన్మస్థలమందు శ్రీ విరూపాక్షుని స్ఫురణతో భవిష్యత్ బ్రహ్మ శ్రీ హనుమంతులవారి సాన్నిధ్యములో  భక్తినగర సామ్రాజ్య నిర్మాణము

భగవంతుని సాన్నిధ్యము ను అనుగ్రహించి భవ్య మందిరముల నిర్మాణము, పంపాక్షేత్ర పునర్వైభవ నిర్మాణము