పంపా క్షేత్ర పునరుద్ధరణ ప్రాజెక్టు

పంపా క్షేత్ర పునరుద్ధరణ ప్రాజెక్టు

కలికల్మషముల సంచయ ప్రభావము నుండి “పంపాక్షేత్ర- కిష్కింధా- హంపి” సంపూర్ణ రక్షణా జీర్ణోద్ధార పునర్వైభవ అభివృద్ధి

సనాతన ధర్మములో ఏదైనా శుభకార్యము ఆరంభముచేయు ముందర ఆకార్యము సఫలమగుటకు దైవము యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదములు తీసుకొని ఆరంభించుట అనాదిగా వస్తున్న మన సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయము అటువంటి పెద్దలు నడిచిన మార్గములోనే నడుస్తూ ఏ మహానుభావుల, మహాభాగవతుల తఫ: ఫలితములతో ఈ ప్రదేశము తీర్థ క్షేత్రముగా, మహా సామ్రాజ్యముల రాజధానిగా ౩౧ కోట్ల సంవత్సరాలనుండి అజరామరముగా విరాజిల్లుతున్నదో  ఆయా సందర్భములలో ధర్మమునకు హాని ఏర్పడు సమయములలో ఏర్పడిననూ  దైవీ కృపతో మహానుభావుల ఆశీర్వాదములతో ఈ క్షేతమునుండి ఆ ధర్మమును రక్షించుకొను లోక కల్యాణ కార్యక్రమములు దైవీ సంకల్పముతో అరంభమగుట కూడా దైవ సంకల్పమే దీనికి సాక్షి అనేక లక్షల సంవత్సరాల నుండి అనేక దేవతలు అనేక తపస్సంపన్నులు, ఋషులు ఆచార్యులు ఇచట తపమాచరించుట మరియూ నిత్య భగవత్, ఆచార్యుల సాన్నిధ్యము ఉండుట అదే ఆశీర్వాదములతో అనేక చక్రవర్తులు అనేక  సామ్రాజ్యములను స్థాపన చేసి ధర్మ పరిరక్షణకై తమ క్షాత్ర బలముతో ఆచార్యుల మార్గదర్శనముతో ధర్మమును, దేశమును, ప్రజలను, ప్ర్రాణికోటిని ఈ దివ్య క్షేత్రమును కాపాడుతూ వచ్చిరి అదే భగవదనుగ్రహముతో మహాభాగవతులు ఆశీర్వాదముతో భగవంతుని శ్రీ పంపా విరూపాక్షుని నిత్య సాన్నిధ్యముతో శ్రీ పరశివును అంశగా భవిష్యత్ ధర్మ పరిరక్షణకై అవతరించిన శ్రీ హనుమంతుని జన్మస్థలమైన ఈ పంపాక్షేత్రము కిష్కింధగా, విద్యానగరముగా, విజయనగరముగా ప్రసిద్ధిపొందిన ఈ క్షేత్రము  కలి ప్రభావమున కొంత కాలముగా అనేక విధ్వంసకర అసురుల ప్రభావముతో ఈ క్షేత్రమునకు  ఎటువంటి విధములుగా హానికి లోనుకాకుండా  స్థావర జంగమాది  సకల ప్రాణులకు భుక్తి ముక్తులను ప్రసాదించే ఈ దివ్య క్షేత్రము కొంతకాలముగా తన భౌతిక రూప పూర్వ ఆచార్యుల స్మృతుల మహారాజధాని చిన్హముల పరంపరల ఆనవాళ్ళన్ను కొన్ని విధ్వంసకర శక్తులు సంపూర్ణనుగా ఈ క్షేత్రమునకు హాని తలపెట్ట సమయమున దైవీ సంకల్పముగా ఆ భగవంతుని నిత్య సాన్నిధ్య దివ్య క్షేత్ర పరిరక్షణకై అ భగవంతుని ఆశీర్వాదముతో ఏ శృంగేరీ ఆచార్యుల జగద్గురు శ్రీ విద్యారణ్యమహానుభావుల అనుగ్రహముతో ఈ క్షేత్రమున  ధర్మపరిరక్షణకై వెలసిన విద్యా, విజయనగర సామ్రాజ్యపు రాజధాని హంపి నగరమును అస్తిత్వ రాహిత్యము కాకుండగా రక్షించుకొనుటకు ౩౧ కోట్ల సం పౌరాణిక ఆధ్యాత్మిక క్షేత్రము ౧౭ లక్షల సంవత్సరాల శ్రీ రామాయణ కిష్కింధా క్షేత్రము

మణి మాణిక్యముల వజ్ర వైఢూర్యముల వైభవ సిరిసంపదల విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి బజార్ –

అప్పుడు

“ఇప్పుడు”

The last landmarks of the ancient Vijayanagara Empire capital “Hampi” city collapse – cause – human selfishness

పురాతన విజయనగర సామ్రాజ్య రాజధాని చిట్టచివ్వరి ఆనవాలు “హంపి” నగర పతనం కారణం – మానవుల స్వార్థమ్

700 సంవత్సరాల విద్యానగర, 500 విజయనగర సామ్రాజ్య రాజధాని
ఈ పంపావిరూపాక్ష క్షేతము హంపి సంపూర్ణ జీర్ణోద్ధార కార్యక్రమములు
పూజ్య  ఆమ్నాయ పీఠము జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీర్వాదముతో దైవీ సంకల్పముగా పరమహంస పరివ్రాజక పూజ్య శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారి మార్గదర్శనముతోఆరంభ మైనవి

ఒక సామ్రాజ్యపతనము ఇంకొక సామ్రాజ్యమునకు నాంది


700 సం పూర్వము శ్రీ విద్యారణ్యుల వారిచే స్థాపింపబడిన హంపినగరము

కలి ప్రభావమున సంపూర్ణముగా కనుమరుగవుచున్న సంధర్భమున వారి స్మృతులను, విజయనగర అస్తిత్వము కనుమరుగు కాకుండగా భగవంతుని సంకల్పముతో  మరల ఆ హంపినగరమును పున: జీర్ణోద్ధారము చేయు సమయమున దైవీ కృపగా అదే క్షేత్రములో నూతన హంపి నగరమునకు స్వర్ణహంపిగా 400 నూతన గృహముల కొత్త హంపి గ్రామమునకు భూమిపూజ శిలాన్యాస కార్యక్రమము హంపి సమస్త గ్రామ ప్రజల సహకారముతో వైభవముగా నిరవేరినది

.

.

.

.

.

.

.

.

హంపి విద్యానగర సామ్రాజ్య సంస్థాపకులు శ్రీ శృంగేరీ జగద్గురువులు


26th March 2014 విజయ యాత్రకై పంపాక్షేత్ర ( హంపి) సమీప హొసపేట పట్టణమునకు విచ్చేసిన సందర్భమున దైవీ సంకల్పముగా
 పంపాక్షేత్ర కిష్కింధా ( హంపి) గ్రామము తరపున శ్రీ చరణులకి పాదపూజ జరిపి పంపాక్షేత్ర కిష్కింధా( హంపి) సంపూర్ణ జీర్ణోద్ధార కార్యక్రమముల వివరములను తెలియజేస్తూ వారి ఆశీర్వాదములు పొందుతూ శ్రీ స్వామివారు

.

.

.

.

“ మీ కార్యక్రమమునకు మా సంపూర్ణ ఆశీర్వాదములు అనతి కాలము లోనే మీ ప్రయాసతో ఈ కార్యము, క్షేత్రము అత్యంత వైభవము గా చాలా పెద్దదిగా ఎదిగి దివ్య వైభవమును సంతరించు కొనును” అప్పుడు మేము కూడా తప్పనిసరిగా వస్తాము”
– శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు

శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములలో భాగముగా ప్రతి సంవర్సరము కిష్కింధ నుండి అయోధ్యకి వెళ్ళే యాత్రలో భాగముగా
“శ్రీ పంపా విరూపాక్షేశ్వర స్వామి వార్ల, మరియూ కిష్కింధ నుండి
శ్రీ అయోధ్యకి సమర్పించిన “శ్రీ కిష్కింధా హనుమద్  సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల” దేవతా ఉత్సవమూర్తులకు   పూజ్య బదరీ జ్యోతిష్పీఠ, ద్వారకా శారదా పీఠ జగద్గురు శంకరాచార్యులు అనంత శ్రీ విభూషిత ధర్మ సామ్రాట్ స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారి దివ్య కరకమలములచే విశేష అర్చన
 ( సం. 2017)

2017 ayodhya yatra from kishkindha_19

2017 ayodhya yatra from kishkindha_23
శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములు కిష్కింధ లోని నిర్మింపబోవు శ్రీ హనుమాన్ దేవస్థాన ప్రారూప విషయములు వివరములను పూజ్య పూర్వామ్నాయ గోవర్ధన పీఠాధీశులు పరమ పూజ్య జగద్గురు శంకరాచార్యులు స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతీ స్వామివారికి నివేదన చేస్తూ వారి ఆశ్శీసులు పొందుట  (2018)

“ఒక సామ్రాజ్యపు పతనము ఇంకొక సామ్రాజ్యమునకు నాంది”

యావత్తు దక్షిణ భారత భూమండలాన్ని ఏక ఛత్రాధిపత్యముగా పరిపాలించిన విజయనగర సామ్రాజ్య చివ్వరి ఆనవాలు, అలనాటి భవ్య విద్యానగర విజయనగర రాజధాని  ఏ వీదులలో రత్న వజ్ర వైఢూర్య మణి మాణిక్యాలు రశులు రాశులుగా పోసి అమ్మేవారోఅటువంటి రాజధాని “హంపి” కొంత మ౧మ్ది స్వార్ధ ప్రయోజనాలకోసం బలి, తుష్కరుల వంచనాత్మక  బుద్ధితో నిత్య దండయాత్రల తో భౌతిక సామ్రాజ్య పతనము అది ఒక ఇతిహాసము
ప్రస్తుతము మిగిలి ఉన్న మరపురాని చివ్వరి విజయనగరపు ఆనవాళ్ళు సామ్రాజ్య రాజధాని “హంపి” నగరము కొంత మంది స్వార్థములకు బలి,  అది ఒక కాళ రాత్రి, ఆహా ! స్వార్ధము ఎంత వినాశకరము కదా..?
 నాశనమైనది  భౌతిక సంపత్తు మాత్రమే..!  ప్రస్తుతము రాజ్యములు లెవు..! రాజులు లేరు..!, ఒక ఇతిహాసము, ఒక యుగము, ఒక వైభవము, గతించినవి,

 ప్రస్తుతము అవి ఇతిహాస పుటములలో చరిత్రలుగా మాత్రమే మిగిలిపోయినవి,

అంతరించిపోయినవి రాజ్యములు మాత్రమే, అంతరించిపోయినవారు రాజులు మాత్రమే.. ఇదికేవలము ఒక 700 సం చిన్న భౌతిక వైభవము మాత్రమే శరీరమునకు మరణము కలదు కానీ ఆత్మకు కాదు, ఇచట శరీరము  ఇప్పటివరకూ ఈ క్షేత్రములో స్థాపింపబడిన విద్యానగర విజయనగర సామ్రాజ్యములు, ఇవి భౌతిక సంపత్తులు మాత్రమే కానీ ఎప్పటికీ నాశనములేని అజరామరమైన శాశ్వతమైనదీ శరీరముకంటే భిన్నమైనదీ సచ్చిదానంద స్వరూపము “ఆత్మ”
ఈ క్షేత్రమున ఆ ఆత్మయే ఇచట ఆధ్యాత్మిక వైభవము, ఆ అధ్యాత్మ వైభవ స్వరూప పరంజ్యోతియే  భగవంతుడైన శ్రీ విరూపాక్షుడు, శరీరము కాలానుగుణంగా మార్పుచెందునది  కానీ ఆత్మ, చైతన్యము త్రికాలములయందు శాశ్వతమైనది

ఒక సామ్రాజ్యపతనము ఇంకొక సామ్రాజ్యమునకు నాంది

మొన్న విద్యానగరము, నిన్న విజయనగరము రేపు….? మానవ మాత్రులచే నిర్మింపబడే భౌతిక వైభవములు ఒకానొక కాలములో కాలగర్భములో కలిసిపోవలసినవే  కాని అటువంటి కాలగర్భ కలిదోషములకు లోబడని భగవద్ కృపతో మాత్రమే ఆయన సంకల్పముతో మాత్రమే నిర్మింపబడునది శాశ్వతము అటువంటిదే ఈ యుగ ధర్మ మును అనుసరించి సకల మానవాళికి ఇహపరములలో శ్రేయోదాయకముగా భగసంసారసాగరములనుండి సకల ప్రాణులను ఉద్దరించు భగవంతుని సాన్నిధ్యములో మహాభాగవతుల జన్మస్థలమైన ఈ పంపాక్షేత్రమందు భక్తియే మూలముగా భగవత్ భక్తుల సంగమ క్షేత్రముగా విరాజుల్లుతున్న ౩౧ కోట్ల సంవత్సరముల ఈ అధ్యాత్మిక వైభవ క్షేత్రము భవిష్యత్ నందు భగవంతుని నిత్య అనుగ్రహ సాన్నిధ్యము ను అనుగ్రహించు “భవిష్యత్ సామ్రాజ్యము”  “భక్తినగర సామ్రాజ్యము”గా మహాభాగవతుల దివ్య భక్తి వైభవములతో భగవద్ భక్తుల సమస్థ ప్రాణులకు పిలిచిన వెంటనే పలుకు భగవంతుని శ్రీ  పంపా విరూపాక్షుని దివ్య నిత్య సాన్నిధ్యము “భక్తివైభవ సామ్రాజ్యము” భవిష్యత్ బ్రహ్మ శ్రీ హనుమంతుని నూతన భవిష్యత్ భక్తినగర సామ్రాజ్యము

“పంపాక్షేత్ర- కిష్కింధా- హంపి” సంపూర్ణ  జీర్ణోద్ధార పునర్వైభవ అభివృద్ధి కార్యక్రమములు – విజయదశమి  ఉత్సవములు పున: ఆరంభము

నూతన హంపి గ్రామము ” స్వర్ణహంపి” ఉత్సవమూర్తులు
భగవాన్ శ్రీ పంపావిరూపాక్షేశ్వర స్వామివారు

2017 విజయదశమీ – పంపాక్షేత్రం

ఇప్పుడు మూల హంపి – పంపాక్షేత్రము ( కిష్కింధా+హంపి) తుంగభద్రా నదికి ఉత్తర తటమున పంపాసరోవరము, అంజనాద్రి పర్వతము, కిష్కింధానగరము , దక్షిణమున శ్రీ హేమకూట పర్వతము, విజయనగర, హంపి నగరము

మూల హంపి

నూతన హంపి గ్రామము స్వర్ణహంపి

కిష్కింధా నగరము

కిష్కింధా నగర జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములు ఆరంభము

కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లు దేవతా ఉత్సవ మూర్తులు

ఆ శ్రీరామ చంద్రుని ప్రాణమైన శ్రీహనుమంతుని దాసానుదాసునిగా ఆ హనుమంతులవారికి సేవచేసుకొనుటకు ఆయన జన్మించిన క్షేత్రమున ఆ కేసరీ అంజనాదేవి అనుగ్రహముతో ఈ క్షేత్రమున శ్రీ హనుమంతులవారికి దివ్యమైన దేవస్థానము నిర్మించుటకు తద్వారా ఈ ప్రపంచమున భక్తి ప్రచారము చేయుటకు, ఇచటకు వచ్చుసమస్త భక్తులకు భగవద్ దివ్య సాన్నిధ్యమును ప్రసాదించు రీతిగా నిత్య శ్రీరామ నామ దివ్య సంకీర్తనలతో ఈ క్షేత్రమునకు వచ్చు ప్రతీ భక్తునికి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహము కలుగు రీతిగా ఈ దివ్య క్షేత్రమును ఇంకా ఇతో అభివృద్ధి చేయురీతిగా ఆ హనుమంతులవారి కృపతో మాత్రమే భగవద్ సేవకై భక్తుల సేవకై  సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి)

పరమ పూజ్య జగద్గురు శంకరాచార్యుల, శ్రీ రామానుజ,  శ్రీ ధ్వాచార్యుల  పరంపరానుగత  వైదిక ధర్మాచార్యుల మార్గదర్శనములో పూజ్య  శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారు అధ్యక్షులుగా పూజ్య  శ్రీ స్వామివారి నేతృత్వములో కర్నాటకాలో పంపాక్షేత్రములొ  ముఖ్య కార్యాలయముగా  5 ఫిభ్రవరి్, 2020 వ తారీఖున ఆధీకృతముగా  ఆ హనుమంతులవారి కృపతో భగవద్, భక్తుల సేవకై  సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి) రిజి స్ట్రేషన్ చేయబడిన

ట్రస్ట్ మర్రిన్ని వివరములు లక్ష్యములు