ప్రశ్నోత్తర జ్ఙాన భండార
అధ్యాయం -౧,౨ : సూత శౌనకాది ప్రశ్నోత్తర నిరూపణం, సప్తర్షీణాం పంపాక్షేత్ర ఆగమనం,
అధ్యాయం -౧,౨ : సూత శౌనకాది ప్రశ్నోత్తర నిరూపణం, సప్తర్షీణాం పంపాక్షేత్ర ఆగమనం, 1) శ్రీ పంపాక్షేత్రం దర్శనం కొరకు వచ్చిన మొదటి మహాత్ములు ఎవరు? స) సప్తఋషులు, 2) సప్తఋషులు, ఎక్కడ నుండి వచ్చినారు? స) నైమిషారణ్యము నుండి, 3) సౌనకాదిఋషులు సూతుడిని ఏమని ప్రశ్నించినారు ? స) సౌఖ్యమునూ, ముక్తినీ అనుగ్రహించు శ్రీ విరూపాక్షుని అత్యంత వైభవ మహిమను శక్తివంతమైన మరియు విముక్తి కలిగించే పంపాక్షేత్ర వైభవమును వివరించమని కోరిరి, 4) శ్రీ విరూపాక్షుని ఆశీర్వాదంతో సప్తఋషులు ఈ క్షేత్రమును చూసి సేవించి ఏ పదమును పొందిరి? స) నక్షత్ర పదవిని, స్థానమును, 5) సప్తారీలు ఇప్పటికీ శాశ్వతంగా ఎక్కడ నివసిస్తున్నారు? స) శ్రీ పంపవిరూపాక్ష క్షేత్రములో గల ఋష్యమూక పర్వతము నందు 6 ) శౌనకాది ఋషులు సూతమహర్షిని అడిగిన మరిన్ని ప్రశ్నలు ఏమిటి ? స) అ) సప్తఋషులు యాత్రార్థులై ఇక్కడకు ఎందుకు వచ్చిరి ? ఆ) యాత్రార్థులై ఇచటకు వచ్చిన పిమ్మట పంచక్రోశాత్మకమైన ఈ క్షేత్రమునందు ఏ ఏ ప్రదేశముయందు పర్యటించిరి, నివాసముండిరి ? ఇ) ఇచట యే యే తీర్థములను చూసిరి, సేవించిరి ? ఈ) శ్రీ హేమకూటపర్వతమున సంచరించి ఏ పదమును పొందిరి ? 7) శ్రీ పంపాపురాణంలో ముఖ్య విషయము ఏమి ఉన్నది? స) శ్రీ పంపాంబికా, శ్రీ విరూపాక్ష స్వామివార్ల దివ్య చరితము అవతార వర్ణనము, శ్రీ పంపాక్షేత్రములో భక్తి మార్గము ద్వారా భగవంతుడిఅనుగ్రహము పొందిన మహాభాగవతుల భక్తిమయ చరితము , కిషింధా నగర వర్ణణ, 8) సప్తఋషులు పేర్లు ఏమిటి? స) శ్రీ కశ్యప, శ్రీ అత్రి, శ్రీ భరద్వాజ, శ్రీ విశ్వామిత్ర, శ్రీ గౌతమ, శ్రీ జమదగ్ని, శ్రీ వశిష్ఠ మహర్షులు. 9) సప్త మహర్షులు ఏవిధముగా ఎవరితో ఈ క్షేత్రమునకు వచ్చిరి? స) సప్త మహర్షులు సతీసమేత శిష్య ప్రశిష్య సహితముగా ఈ క్షేత్రమునకు వచ్చిరి, 10) ఈ పంపాక్షేత్రము సాక్షాత్ కాశీయే అనెడి తెలుపు ప్రమాణ శ్లోకము ఏది? స) శ్లోకము : విరూపాక్షస్తు విశ్వేశ: తుంగభద్రాతు జాన్హవీ | పంపా కాశీ సమా దివ్యా భుక్తి ముక్తి ప్రదాయినీ ||
అధ్యాయం -౩ : సప్తర్షీణాం క్షేత్రపాల దర్శనం,
అధ్యాయం -౪ : బ్రహ్మాదీనాం కైలాసాగమనం,
అధ్యాయం -౫ : పంపాదేవ్యై ఈశ్వరేణ వరప్రసాదం,
అధ్యాయం -౬ : పంపాయా గంధర్వాయ శాపప్రదానం,
అధ్యాయం -౭ : శ్రీ పంపావిరూపాక్షేశ్వరయో: వివాహం,
అధ్యాయం -౮ : హర మిత్ర: ఉపాఖ్యానం, తస్య విరూపాక్షద్వార ప్రాప్తి:,