ಸೇವಾ ವಿವರಗಳು

ಸದಾ ನನ್ನ ಚಿತ್ತ, ದಯದಲ್ಲಿ ಶ್ರೀರಾಮ ಇರಲಿ  ಶ್ರೀ ಪಂಪಾವಿರೂಪಾಕ್ಷ ನಮ್ಮನ್ನು ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹಾದಿಯಲ್ಲಿ ಸಾಗಿಸಲಿ,, ನಮ್ಮನ್ನು ಪಾಲಿಸಲಿ, ಮಾತಾ ಅಂಜನೀಪುತ್ರ ಶ್ರೀ ಹನುಮಂತನ ನಮ್ಮನ್ನು ಅವನ ದಾಸನ್ನಗಿ ಸ್ವೀಕರಿಸಿ ಈ ಸೇವಕನನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂದೆ ಗೆ ಸೀವಾ ಭಾಗ್ಯ ಒದಗಿಸಲಿ,  ನಮ್ಮ ಜನ್ಮ ಭಗವದ್ ಭಕ್ತಿ ಯಲ್ಲಿ ತೊಡೆಗು ಪೂರ್ವದಲ್ಲಿ ಭಗವಂತ ಮಹಾಭಾಗವತರೆಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತ ಅನಂದ   ಭಕ್ತಿಭಾವನೆ ಯಿಂದ ನಮ್ಮ ಮೈತುಂಬಿ, ಭಗವತ್ ಸನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಅವನ ಸೇವೆಯಲ್ಲಿ  ಭಗವಂತನ, ಭಕ್ತರ, ಭಕ್ತಿಯ, ಭಕ್ತರ ಭಕ್ತಿಯಿಂದ ಪ್ರಸನ್ನನ್ನಾಗಿ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತ ಭಕ್ತರ ಕಡೆಗೆ ಬಂದು ಅನುಗ್ರಹಿಸುವವನೋ ಅಂತಹ  ಭಕ್ತಿ ಸಂಗಮ ಕ್ಷೇತ್ರವಾದ, ಭಕ್ತಿನಗರ ವಾದ, ಭವಿಷ್ಯತ್ ಭಕ್ತಿನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ವಾದ  ಈ ಪಂಪಾಕ್ಷೆತ್ರ ಕಿಷ್ಕಿಂಧೆಯ ಸೇವೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಗಲಿ

ಕಿಷ್ಕಿಂಧೆ ಯಲ್ಲಿ ಶ್ರೀ ಹನುಮಾನ್ ದೆವರಿಗೆ ನಿರ್ಮಿಸಲಿರುವ ೨೧೫ ಮೀಟರ್ “ಭಕ್ತಿ ವೈಭವ್” ವಿಗ್ರಹ ದೇವಾಲಯ ವನ್ನು ನಿರ್ಮಿಸಲು, ಭೂ ಸಮೀಕರಣ ಮತ್ತು ಭೂದಾನಕ್ಕಾಗಿ

శ్రీ పంపాక్షేత్ర  కిష్కింధా జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములు  

౩౧ కోట్ల సంవత్సరాల ఆధ్యాత్మిక పౌరాణికఐతిహాసిక దివ్య క్షేత్రమందు శ్రీ పంపాక్షేత్ర పంపాసరోవర పశ్చిమతటమునఋష్యమూకపర్వతతుంగభద్రా నదీ సమీపమునశ్రీ పరమేశ్వరుని అనుగ్రహముతో వాయు దేవత అంశతో కూడిన,  కిష్కింధా అంజనాద్రి పర్వతమునందు  శ్రీ కేసరీ అంజనీ దేవి దంపతులకు జన్మించినఅమిత తేజోసంపన్నమైనశ్రీ మహాభాగవతులలో శ్రేష్ఠుడుశ్రీరామ దూత,  భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమంతులవారు చిరంజీవిగా ఇప్పటికీ పంపాతీర నివాసిగా  భక్తులను అనుగ్రహిస్తున్న  శ్రీ హనుమంతులవారి జన్మభూమి  శ్రీ కిష్కింధలో భగవద్ భక్తులు చే నిర్మింపబడుతున్న భవ్య “భక్తి వైభవ విగ్రహ” 215 మీటర్ల ప్రపంచములోనే అత్యంత ఎత్తైన భక్తివైభవ విగ్రహము శ్రీ  కిష్కింధా హనుమద్  జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవి  మందిరం, 1200 కోట్ల వ్యయముతో  100 ( 20+30+50 ) ఎకరములలో 12 సంవత్సరముల కాలములోఇతిహాసములో మొట్టమొదటి సారిగా శ్రీ హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధా లో శ్రీ హనుమంతులవారికి నిర్మింపబదుతున్న  శ్రీ  కిష్కింధా హనుమద్  జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవి  మందిరం,  దివ్య శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా నగర సామ్రాజ్య రాజధాని పునర్నిర్మాణము

ఈ పై జరువు అత్యంత పవిత్రమైన ఐతిహాసిక కార్యక్రమములలో సకల భక్తులు తమవంతు సహాయ సహకారములు అందించుటకు ఈ హనుమంతులవారి జన్మస్థళ కిష్కింధా నగర జీర్ణోద్ధార కార్యక్రమములలో భాగము వహించుటకు

భగవదనుగ్రము పొందుటకు భక్తులు వారి శక్తి అనుసారముగా సేవనందించుటకు శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సంశ్థ వారు గత కొన్ని సంవత్సరములుగా అనేక సేవాకార్యక్రమములను  చేస్తూ శ్రీ రామజన్మభూమి అయోధ్యా మరియూ, శ్రీ సీతా అమ్మవారి జన్మభూమి – జనక్పురి,  శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా ఈ మూడు క్షేత్రముల  పునైవైభగమునకు కృషిచేస్తూ ౧౭ లక్షల సంవత్సరాల త్రేతాయుగపు పునర్వైభవమును క్షేత్రముల పునర్ నిర్మాణముల కార్యములలో అనేక పవిత్ర  సేవా కార్యములు ఆరంభించినారి  సద్భక్తులు కార్యక్రమములలో భాగము వహించుటకు

శ్రీ కిష్కింధా హనుమద్  జన్మభూమి  మందిరం శిలా దానము   శ్రీ కిష్కింధా హనుమద్  జన్మభూమి  మందిరం నిర్మాణమునందు దివ్య శిలా దానము

దేవస్థాన నిర్మాణమందు ఉపయోగించుటకు బృహత్ శిలలు ఒకొక్క శిలా ప్రమాణము  12 *2*2 అడుగులు,  మొత్తము 10,000 శిలలు
ఒక్క కిష్కింధా శిలకు  దానము  – రూ 10,000 /-

కిష్కిం లొ శ్రీ హనుమంతుల వారికి శ్రీ హనుమద్ జన్మభూమి 215 మీటర్ల “భక్తి వైభవ” విగ్రహ, మందిరము నిర్మాణమునకు
“శ్రీ కిష్కింధా భక్తహనుమాన్” “భక్తి వైభవ” మందిర స్థల సమీకరణమునకు భూదానము నిమిత్తము

ప్రపంచములో నే శ్రీ హనుమంతులవారికి అతి ఎత్తైన ‘215’ మీటర్ల శ్రీ హనుమద్ ‘భక్తి వైభవ’ విగ్రహ దేవస్థానము 100 ఎకరములలో  నిర్మాణము :
 భవ్య “భక్తివైభవవిగ్రహ” 215 మీటర్ల ప్రపంచములోనే అత్యంత ఎత్తైన భక్తివైభవ విగ్రహము శ్రీ  కిష్కింధాహనుమద్జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవిమందిరం, 1200 కోట్లవ్యయముతో  100 ( 20+30+50 ) ఎకరములలో 12 వత్సరములకాలములో, ఇతిహాసములో మొట్టమొదటిసారిగా శ్రీ హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధా లో శ్రీహనుమంతులవారికినిర్మింపబదుతున్న శ్రీ  కిష్కింధా హనుమద్జన్మభూమి శ్రీ బాలహనుమాన్ అంజనీదేవిమందిర


హనుమద్ జన్మభూమి కిష్కింధలో భగవద్భక్తులుచేనిర్మింపబడుతున్న ఈ దివ్య మహాకార్యమునకు గాను అందాజు వెచ్చము 1200 కోట్లు రూపాయలు, మహాభాగవతులలో  అగ్రగణ్యుడైన శ్రీ రామ చంద్ర మూర్తి కి పరమ ప్రియుడైన భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమంతుల వారు జన్మించిన పంపాక్షేత్ర కిష్కింధా యందు ఇతిహాసములో మెట్టమొదటిసారిగా శ్రీ హనుమంతులవారు జన్మించిన ఆయన జన్మ స్థలమందు శ్రీహనుమంతులవారికి మొట్టమొదట దివ్య, భవ్య దేవస్థాన నిర్మాణము ఈ నిర్మాణమునకు దీనికి తగిన స్థళము సమీకరణకు అగు వెచ్చములో భక్తులు తమవంతు సహాయ సహకారములు అందించి శ్రీ హనుమంతుల వారి కృపకు  పాతృలు కావటానికి భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ అంజనీపుత్ర శ్రీ హనుమంతులువారి అనుగ్రహము పొందుటకు వివిధ సేవలు,

భగవంతుని కృపకు పాత్రులగుటకు శ్రీ హనుమంతుని అనుగ్రహమునకు శ్రీ హనుమద్ జన్మ స్థలముకిష్కింధ లో శ్రీ హనుమంతుని భవ్య భక్తివైభవ ప్రతిమకు దేవస్థానమునకు 100  ఎకరములకై భూదానము స్థళము సమీకరణకు భూదానము నకు

దాతలు – 1 లక్ష, మహాదాతలు – 2 లక్షలు, దివ్య దాతలు – 5 లక్షలు,

శ్రీ రామాయణ కిష్కింధా గ్రామ
సంపూర్ణ రామాయణము, చిత్రముల ఉద్యానవన నిర్మాణము,

త్రేతాయుగమున అసుర సంహారమునకై ధర్మస్థాపనకై శ్రీమన్నారాయణుడు అయోధ్యయందు శ్రీరామునిగా ధర్మమూర్తిగా అవతరించి భూమండలమున సమస్తప్రాణులను ఉద్దరించిటకు కాలినడకన అయోధ్య నుండి శ్రీ పంపాక్షేత్ర కిష్కింధకు వచ్చి ఇచటనుండి వానర సైన్యముతో లంకయందు అసురులను సంహరించి ధర్మమును కాపాడిన, సద్భక్తులను అనుగ్రహించిన దివ్య రామచరితమును సంపూర్ణముగా లోకమునకు అందించిన శ్రీ వాల్మీకి మహర్షుల సంపూర్ణ రామాయణమును ‘చిత్రముల ద్వారా” ఉద్యానవన  సంపూర్ణ శ్రీ రామాయణ అయోధ్యా-కిష్కింధా తీర్థ, గ్రామ నిర్మాణము దీనియందు సంపూర్ణ రామాయణము వివిధ ఘట్టములను అపురూప చిత్రములతో నిర్మింపబడును,

సంపూర్ణ రామాయణమును తెలుపు , సంపూర్ణ శ్రీ రాములవారి
శ్రీ హనుమంతులవారి చరిత్రను , 31 కోట్ల సం, 17 లక్ష సం పంపాక్షేత్ర కిష్కింధా వైభవమును తెలియ జేసేవిధముగా అనేక సంఘటనల చిత్రరూప

త్రేతాయుగమున అసుర సంహారమునకై ధర్మస్థాపనకై శ్రీమన్నారాయణుడు అయోధ్యయందు శ్రీరామునిగా ధర్మమూర్తిగా అవతరించి భూమండలమున సమస్తప్రాణులను ఉద్దరించిటకు కాలినడకన అయోధ్య నుండి శ్రీ పంపాక్షేత్ర కిష్కింధకు వచ్చి ఇచటనుండి వానర సైన్యముతో లంకయందు అసురులను సంహరించి ధర్మమును కాపాడినసద్భక్తులను అనుగ్రహించిన దివ్య రామచరితమును సంపూర్ణముగా లోకమునకు అందించిన శ్రీ వాల్మీకి మహర్షుల సంపూర్ణ రామాయణమును చిత్రముల ద్వారా” ఉద్యానవన  సంపూర్ణ శ్రీ రామాయణ అయోధ్యా-కిష్కింధా తీర్థగ్రామ నిర్మాణము దీనియందు సంపూర్ణ రామాయణము వివిధ ఘట్టములను అపురూప చిత్రములతో నిర్మింపబడును,

ప్రపంచములోనే శ్రీ హనుమంతులవారి అత్యంత ఎత్తైన 80’ అ- రథము అడుగులు, కిష్కింధా రథ నిర్మాణము  శ్రీ హనుమంతులవారికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవములు జరిపించుటకు దివ్య బ్రహ్మ రథోత్సవము జరిపించుటకు హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధా రథ నిర్మాణము

రథము మొత్త ము విలువ 4 కోట్లు   ఈ రథ నిర్మాణ కార్యమునకు కావలసిన వస్తు సామాగ్రి టేకు, భోగి, హెబ్బళుసు చెక్క, లోహము దానము,

హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధా రథ నిర్మాణ సేవా – 1,00,000 / –

ప్రపంచములోనే శ్రీ  రామచంద్రులవారికి  అత్యంత ఎత్తైన 82′ అ – రథము అడుగులు, అయోధ్యా శ్రీ రామ రథ నిర్మాణము  శ్రీ కిష్కింధా హనుమంతులవారి తరపున  అయోధ్యా శ్రీ రాముల వారికి ఒక భవ్య నూతన రథము నిర్మించి అయోధ్య కు సమర్పించు అత్యంత పుణ్య ప్రద  కార్యము  ప్రతి సంవత్సరము అయోధ్యలో  బ్రహ్మోత్సవములు  బ్రహ్మ రథోత్సవము  జరిపించుటకు హనుమద్ జన్మభూమి శ్రీ కిష్కింధాతరపున తన ప్రభువైన శ్రీ రామ చంద్రు;అవారికి శ్రీ హనుమంతులవారు సమర్పించుకొను భక్తి రథము ఈ  రథ నిర్మాణ వెచ్చము మొత్తము  4 కోట్లు   ఈ రథ నిర్మాణ కార్యమునకు కావలసిన వస్తు సామాగ్రి టేకు, భోగి, హెబ్బళుసు చెక్క, లోహము ఇతర వస్తువుల  అలంకార సామ్రాగ్రిలు సెవా కార్యమునకై

శ్రీ  రామచంద్రులవారికి   రథ నిర్మాణ సేవా – 1,00,000 / –

సీతా అమ్మవారి ఆభరణముల నిర్మాణము శ్రీ సీతా అమ్మవారు పుష్పక విమానమునుంచి కిష్కింధలో సుగ్రీవ, హనుమంతుల , వానరులు ఉన్న ప్రదేశములో పడవేసిన ఆ ఆభరణములను సుగ్రీవుడు ఋష్య ముక పర్వతము ముందర ఉన్న పర్వత గుహలో దాచిపెట్టి మరల వాటిని తీసి శ్రీ రాములవారికి సమర్పించిన అత్యంత పవిత్రమైన ఆ నూపురములు, మంజీరాలు, చూడామణి,  మరియూ శ్రీ రాఅములవారి రాజముద్ర శ్రీ రాములవారి అంగుళీయము ఇత్యాది అత్యత పవిత్రమైన ౨  ఆభరణములు సెట్లు చేయించి ౧) అయోధ్యకి వెళ్ళి అచ్చట భగవంతునికి సమర్పించుట, ౨) ప్రతి సంవత్సరము కిష్కింధ లో సంవత్సరము శ్రీ సీతా రామ కళ్యాణము ఉత్సవమున అలంకారము చేయుట ,

శ్రీ రామనవమీ, శ్రీ రామ మహా సామ్రాజ్య పట్టాభిషెకం, శ్రీ సీతానవమీ,
శ్రీ హనుమద్ జయంతి, విజయోత్సవములు,

కలియుగములో భగవత్ సాక్షాత్కారము, భగవత్ కృపకి పాత్రులగుటకు ఏకైక మార్గము ఆ భగవంతునిని అచంచలమైన భక్తి తో కొలుచుట అటువంటి భక్తిని లోకమునకు అందించిన మహాభాగవతున జన్మస్థలమైన శ్రీపంపాక్షేత్ర కిష్కింధ యందు ఆ దివ్య ధర్మ మూర్తి యొక్క శ్రీరాముని యొక్క శ్రీ సీతా మాత యొక్క శ్రీ హనుమంతులవారి యొక్క వివిధ జయంతులు, విజయోత్సవములు వివిధ సేవలు ఉత్సవములు వివిధ సేవలకై
దాతలు 1 లక్ష, మహాదాతలు 2 లక్షలు,

సీతా అమ్మవారి ఆభరణముల నిర్మాణము శ్రీ సీతా అమ్మవారు పుష్పక విమానమునుంచి కిష్కింధలో సుగ్రీవ, హనుమంతుల , వానరులు ఉన్న ప్రదేశములో పడవేసిన ఆ ఆభరణములను సుగ్రీవుడు ఋష్య ముక పర్వతము ముందర ఉన్న పర్వత గుహలో దాచిపెట్టి మరల వాటిని తీసి శ్రీ రాములవారికి సమర్పించిన అత్యంత పవిత్రమైన ఆ నూపురములు, మంజీరాలు, చూడామణి,  మరియూ శ్రీ రాఅములవారి రాజముద్ర శ్రీ రాములవారి అంగుళీయము ఇత్యాది అత్యత పవిత్రమైన ౨  ఆభరణములు సెట్లు చేయించి ౧) అయోధ్యకి వెళ్ళి అచ్చట భగవంతునికి సమర్పించుట, ౨) ప్రతి సంవత్సరము కిష్కింధ లో సంవత్సరము శ్రీ సీతా రామ కళ్యాణము ఉత్సవమున అలంకారము చేయుట ,

శ్రీ  కిష్కింధా వైభవం, శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:

కలియుగమునందు సేవింపతగిన క్షేత్రములలో ఉత్తమమైనది నిత్యమూ భగవంతుని- దివ్య నిత్య సానిధ్యముతో  భక్తుల దివ్య భక్తితో భగవంతునిని సాక్షాత్కరించుకొనిన దివ్య క్షేత్రముల వైభవమును పవిత్రతను తెలుపు వేదోక్త, ఆగమోక్త వివిధ ఉత్సవములు ఆచరణ శ్రీ  కిష్కింధా వైభవం,  శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:

దాతలు : 1 లక్ష, మహాదాతలు 2 లక్షలు,

జన్మదిన సేవా కైంకర్యము  భక్తులు వారి వారి జన్మ తిథి దినమున సంవత్సరమున ఒక్క రోజు భగవంతునికి సేవా కైంకర్యములకు
 వారి జన్మ తిథియందు సంవత్సరమునకు ఒకసారి భగవంతుని సేవా కైంకర్యములు చేసుకొనుటకు విశేష పూజా కార్యక్రమము ఆ రీజు వారి నామ గోత్రములతో భగవంతులవారికి నూతన వస్త్ర,  ఫల, పుష్ఫ సమర్పణ ఇత్యది,

భక్తులు వారి వారి జన్మ తిథి దినమున జన్మదిన  సేవా కైంకర్యము – 5000/-

శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా రథ యాత్ర – 12  సం సంపూణ భారతదెశములో  కిష్కింధా రథ యాత్ర  శ్రీ రామ భక్తి,
శ్రీ హనుమంతులవారి భక్తి వైభవము, పంపాక్షేత్ర కిష్కింధా వైభవము, శ్రీ రామాయణ ప్రచారము , శ్రీ సీతారామ కల్యాణ వైభవ ఉత్సవములు, ఇత్యాది అనేక ధార్మిక కార్యక్రమములు ఈ ౧౨ సంవత్సరాల ఈ యాత్రలో సంపూర్ణ భారతదేశమందు ప్రతీ రాష్ట్రములో ప్రతీజిల్లాలలో ప్రతీ తాలూకులో కిష్కింధా రథమునందు 
శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల దేవతా ఉత్సవమూర్తుల విరాజమానులై అందరికి దర్శన సేవాభాగ్యము పూజా భాగ్యము కలుగు రీతిలో ప్రసాద వితరణ ఇత్యాది అనేక కార్యక్రమములతో ఈ దివ్య రథ యాత్ర  

ఈ రథ యాత్ర సేవా కార్యక్రమము – 5,000/-  
ఒక రోజు సంపూర్ణా యాత్రా  సేవా – 1,00,000/-    

“భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివాస్ ఏర్పాటు

భగవభక్తితో పంపాక్షేత్రమునకు వచ్చు భగవద్ భక్తులకై “భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివస్ ఏర్పాటు

గదుల నిర్మాణ దాతలు : 1 లక్షలుభవన నిర్మాణ దాతలు : 5 లక్షలు

స్వతంత్ర భవనిర్మాణ దాతలు 10 లక్షలు

శ్రీ పంపాక్షేత్ర గురుకులమ్,

అనాదిగా వస్తున్న సనాతన ధర్మ వైభవమునకు మూలములైన శృతుల, స్మృతుల, పురాణముల, ఇతిహాసముల వైభవమును ఆచార్య, ఆచార పరంపరల పరిరక్షణలు వైదిక ఆచార్యుల గురువులైన భగవాన్ శ్రీ విష్ణువుయొక్క అవతారమైన శ్రీ భగవాన్ వేదవ్యాసులువారు సాక్షాత్ గా ౫౩౦౦ సంవత్సరముల పూర్వము ఈ క్షేత్ర పరిరక్షణకు, ధర్మ రక్షణకు  విశేషముగా  కలియుగమున సమస్త ప్రాణుల హితమునకు తామే స్వయముగా కాశీనుండి ఈ క్షేత్రమునకు వచ్చి వేదవ్యాస ఆశ్రమమును స్థాపించి అధ్యయన అధ్యాపన విధానములతో జాబాలి ఆదిగా గల ఋషిమునులు విద్యార్థులుగా ధర్మ పరిరక్షణకై ఆనాడు వేదవ్యాసుల వారి చే స్థాపింపబడిన ఆ గురుకులము మరల భగవంతుని కృపతో జగద్గురువుల ఆశీర్వాదములతో పున: జీర్ణోద్ధారము చేయబడినది ఇటువంటి ఈ దివ్య క్షేత్రమును సంపూర్ణముగా ఈ క్షేత్ర మహిమను తెలుపు దివ్య పురాణమును స్కాంధపురాణాంతర్గతముగా సప్తఋషిప్రకాశికా యాత్ర అను నామముతో “శ్రీ పంపాపురాణముగా” శ్రీ వేదవ్యాసులవారు రచించిరి దీని ఆధారముగా ఈ క్షేత్రమున ఆగురుకులము జీర్ణోద్ధారము చేయబడి వైదిక విద్యార్థులతో నడపబడుతున్నది ఇందు వేద, శాస్త్రములేకాక విశేషముగా  

భగవత్ తత్వ ప్రచారమునకై ధర్మ మూర్తిఅయిన శ్రీరామ చంద్రుని దివ్య అమృతమును శ్రీమద్ వాల్మీకి రచించిన శ్రీమద్ రామయణమును, మరియూ భాగవత, మహాభారతముల నిత్య అనుసంధానముగా అధ్యయన అధ్యాపనములతో కూడా విద్యార్థులు అధ్యయనము చేయుదురు


శ్రీ పంపాక్షేత్ర గురుకులమునకు పోషకులు 2 లక్షలు

భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము”

కలియుగమున ముక్తికి పరమ సాధనము భక్తియే అటువంటి భక్తిని కలియుగమున విశేషముగా ఆచరించిన భగవంతుని అనుగ్రహము విషేశముగా కలుగును అటువంటి భక్తిని ఆచరించి తరించిన మహానుభావులు ఎందరో ఈ పవిత్ర క్షేత్రమును వారి జీవనములతో భగవంతుని భక్తితో ఈ క్షేత్రమును మహాక్షేత్రముగా పారమ పవిత్రముగా ఆరాధించినారు అటువంటి భక్తిని సంకీర్తనలను భగవంతుని లీలావైభవమునను తెలుపు దివ్య సత్సంగములను ఆచరించుకొనుటకు భగవంతుని దివ్య కల్యాణములను ఆచరించుకొనుటకు భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము” నిర్మాణము

గదుల నిర్మాణ దాతలు : 1 లక్షలు, భవన నిర్మాణ దాతలు : 5 లక్షలు,