” శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి.135/2020) ” కలియుగమున సకల జీవుల జన్మ సార్థక్యానికి భగవత్ప్రాప్తికి సోపానము భక్తి మాత్రమే, అటువంటి భక్తిద్వారా భగవత్ప్రాప్తిని , అనుగ్రహమును పొందిన వారిలో మహాభాగవతులలో శ్రీ హనుమంతులవారు పరమఉత్కృష్టులు రామ భక్తికి మూర్తి స్వరూపుడై శ్రీరాముని సేవలో తాను తరిస్తూ భవిష్యత్తులో సకల మానవాళికి ఆరాధ్యుడై శ్రీరామనామమును తన రోమరోమమున నింపుకుని సకల జగత్తుని ఉద్దరించు తారక మంత్రమును శ్రీరామ నామ అమృత రసమును లోకమునకు అందించిన సాక్షాత్ భక్తి, జ్ఞాన సాగరము, జితేంద్రియుడు, వానరశ్రేష్ఠుడు, అయిన శ్రీ హనుమంతులవారు భవిష్యద్ బ్రహ్మగా సకల జీవరాశులయొక్క లలాటములను లిఖించు బ్రహ్మగా కలియుగమున కలిప్రభావ అంధకారముల అనాదిమాయలో ఉన్న జీవుల ఉద్దారమునకై నిత్యమూ కిష్కింధ యందు తన నిత్య సాన్నిధ్యముతో సకల భక్తులను అనుగ్రహించుటకు శ్రీ హనుమంతులవారు ఇచ్చట చిరంజీవులులై అనుగ్రహించుచున్నారు ,
అటువంటి ఆ చిరంజీవి యొక్క అనుగ్రహముతో మాత్రమే ఆ పవనపుత్రుని స్ఫురణ తో ఆ హనుమంతుల వారి జన్మ క్షేత్రమునకు సేవచేసుకొనుచూ మానవమాత్రులైన మన జన్మలను కూడా సార్థకము చేసుకొనుటకు గాను ఆ శ్రీరామచంద్రులవారి, శ్రీ హనుమంతులవారి పాద స్పర్శతో పునీతమైన ఈ పంపాక్షేత్రమున భగవద్ సేవకై , శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా సంపూర్ణ జీర్ణోద్ధార కార్యక్రముమలకై ఆరంభింపబడిన సంస్థ ఈ కిష్కింధా హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి)
మరికొన్ని ట్రస్ట్ వివరముల కొరకు