31 కోట్ల సం ఐతిహాసిక పౌరాణిక, అధ్యాత్మిక, 17 లక్షల సం శ్రీ త్రేతాయుగ దివ్య శ్రీ కిష్కింధా పునర్వైభవ కార్యమములు శ్రీ హనుమంతులవారి జన్మస్థలము శ్రీ అంజనాపర్వత కిష్కింధ యందు శ్రీ పరమేశ్వర అంశతో వాయుదేవుని ఆశీర్వాదముతో శ్రీ కేసరీఅంజనీసుత సుతులకు జన్మించిన మహా భాగవతులతో శ్రేష్టుడు శ్రీ రామదాసుడు భవిష్యత్ చతురాననుడు అయిన శ్రీ కిష్కింధా హనుమంతులవారికి శ్రీ శార్వరీనామ సంవత్సర ఆశ్వీయుజ శుక్ల నవమీ, దశమీ, ఏకాదశీ ౩ రోజుల – “215” మీటర్ల శ్రీ కిష్కింధా హనుమద్ భక్తివైభవ మూర్తి దేవస్థాన – శిలాన్యాస శిలాపూజ, “శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల” దేవతా ఉత్సవ మూర్తుల చర ప్రతిష్ఠా మహోత్సవము
“ఇది భగవంతుని సంకల్పము, భగవంతుని కార్యము చేసేది, చేయించేది ఆయనే.. మేము నిమిత్తులము మాత్రమే”
పంపాక్షేత్ర కిష్కింధా నగర సామ్రాజ్య జీర్ణోద్ధార పునర్వైభవము, కలికల్మష సంచయ ప్రభావములనుండి శ్రీ పంపాక్షేత్ర రక్షణ, పునర్వైభవ నిర్మాణము భక్తినగర సామ్రాజ్య అష్ఠమ వార్షికోత్సము
25,26,27 అక్టోబర్ 2020
శ్రీ పంపాక్షేత్ర స్వర్ణ హంపియందు అమావాస్య రోజు శ్రీ పంపావిరుపాక్షేశ్వరుల పల్లకీ ఉత్సవము చేసుకొని
అష్ఠాదశ శక్తి పీఠములలో అందునా శ్రీ శరన్నవరాత్రి పర్వదినములలో శ్రీ హనుమద్గిరి శ్రీ పద్మాక్షి దేవి అమ్మవారి
శ్రీ పీఠికాపురమున పురుహూతికా అమ్మవారి, శ్రీ ద్రాక్షారామమున శ్రీ మాణిక్యాంబా అమ్మవారి, శ్రీ విజయవాటిక యందు శ్రీ కనకదుర్గా అమ్మవారి, శ్రీశైలమున శ్రీ బ్రమరాంబికా అమ్మవారి, శ్రీ ఆలంపురమున శ్రీ జోగుళాంబా అమ్మవారికి విశేష పూజ అర్చనలు చేసి పంపాక్షేత్ర కిష్కింధా, హంపి విద్యానగర, విజయనగర సామ్రాజ్యముల
కు ప్రతీకగా విజయ ఖడ్గమును 5 శక్తిపీఠముల చేయుట జరిగినది ఇది అమ్మావారి సంకల్పము మాత్రమే




శ్రీ రాములవారి సేవ లో తత్పరులై ధన్యులైన శ్రీ హనుమంతులవారి సేవలో మమ్ములను మేము ధన్యులను చేసుకొనుటకు ఆ హనుమంతులవారి వైభవమును భక్తితత్వమును పంపాక్షేత్ర కిష్కింధా వైభవమును మరుల అందరికి ప్రత్యక్ష అనుభవము అగు రీతిలో ఈ క్షెత్రమున నిర్మింపబోవు బృహత్ దేవస్థానమునకు కార్యక్రమములు ఆరంభము
ఏకార్యము ఏవిధముగా సంపన్నము అవ్వాలి అన్నింటినీ ఆ పరమాత్మయే సమయ సందర్భానుసారముగా స్ఫురణ, ప్రేరణ యిచ్చి చేయించుకుంటున్నారు తప్ప మాది, మేము, మా ఆలోచన తప్ప ఏమీలేదు,
ఏమి చేయాలి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత, ఎవరితో, ఎందుకు అన్నింటికీ ఆయనే ప్రేరణ మేము నామమాత్రము మాత్రమే
పంపాక్షేత్రము నందు శ్రీ పంపా విరూపాక్షేశ్వరస్వామివార్ల పల్లకీ ఉత్సవము ఆచరణ
శ్రీ శరన్నవరాత్రి పర్వదినములలో ఓరుగల్లు ఏకశిలానగరమున కాకతీయనగర సామ్రాజ్య అధిదేవత శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి వద్ద దేవీ నవరాత్రులు ఆరంభము
కాకతీయనగర సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు ఏకశిలానగర జీర్ణొధార పునర్వైభవ కార్యక్రమములు అరంభము
శిలాన్యాస శిలల పూజ

శ్రీ శరన్నవరాత్రి పర్వదినములలో అందునా అష్ఠాదశ శక్తి పీఠములలో
శ్రీ పీఠికాపురమున పురుహూతికా అమ్మవారి దర్శనము అర్చనము విజయ ఖడ్గమునకు అమ్మవారి గర్భ గృహములో సన్నిధానములో పూజ,
శ్రీ అన్నవరము సత్యన్నారాయణ స్వామివారి దివ్య సాన్నిధ్యములో విశేష పూజ అర్చనలు
శ్రీ ద్రాక్షారామమున శ్రీ మాణిక్యాంబా అమ్మవారి దర్శనము అర్చనము విజయ ఖడ్గమునకు అమ్మవారి గర్భ గృహములో సన్నిధానములో పూజ,
శ్రీ విజయవాటిక యందు శ్రీ కనకదుర్గా అమ్మవారి అమ్మవారి దర్శనము అర్చనము విజయ ఖడ్గమునకు అమ్మవారి గర్భ గృహములో సన్నిధానములో పూజ,
శ్రీశైలమున శ్రీ బ్రమరాంబికా అమ్మవారి అమ్మవారి దర్శనము అర్చనము విజయ ఖడ్గమునకు అమ్మవారి గర్భ గృహములో సన్నిధానములో పూజ,
శ్రీ ఆలంపురమున శ్రీ జోగుళాంబా అమ్మవారికి విశేష పూజ అర్చనలు అమ్మవారి దర్శనము అర్చనము విజయ ఖడ్గమునకు అమ్మవారి గర్భ గృహములో సన్నిధానములో పూజ,

1 రోజు
ఇది భగవంతుని సంకల్పము పంపాక్షేత్ర కిష్కింధ యందు జరుగు శిలాన్యాస శిలా పూజ ఉత్సవ మూర్తుల ప్రతిష్ఠకి విజయదశమి పూజకి శక్తిపీఠములనుండి విషేశ ప్రసాదములు

పంపాసరోవర మునందు శ్రీ పంపావిరూపాక్షేశ్వరస్వామివార్లకు, శ్రీ కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ దేవతా ఉత్సవ మూర్తులకు పంపాసరోవర జలములతో స్నపనము


కిష్కింధ యందు నిర్మించబోవు ౨౧౫ మీటర్ల ప్రపంచములోనే ఎత్తైన శ్రీ భక్తివైభవ విగ్రహమునకు మరియూ బృహత్ శ్రీ కిష్కింధా హనుమద్ దేవస్థానానికి, శ్రీ కిష్కింధా- రామాయణమునకు శిలాన్యాస శిల లకు పూజ పంపాసరోవర జలములతో స్నపనము
శ్రీ పంపాంబికా అమ్మవారి సాన్నిధ్యమున విశేష పూజ
శ్రీ కిష్కింధా హనుమంతులవారి జన్మస్థలము అంజనాద్రి పర్వతముపైన శ్రీ హనుద్ ఉత్సవమూరికి విశేష పూజ


అంజన హళ్ళి, హనుమన హళ్ళి, చిక్కరాంపుర ఆనెగొంది గ్రామ ఉత్సవము,
2 వరోజు – విజయదశమీ
స్వర్ణ హంపి గ్రామములో గ్రామోత్సవము
తుంగభద్రా నదీ జలములతో స్నపనము

శ్రీ హేమకూటపర్వర గిరి ప్రదక్షిణము మూల హంపి గ్రామ ఉత్సవము
విజయదశమి పర్వదినమము సందర్భముగా సాయంకాలము భగవాన్ వేద వ్యాస ఆశ్రమమునందు గల శమీ వృక్షమునందు ఆయుధ పూజ , శమీ పూజ, అపరాజితా పూజ

భగవంతుని సంకల్పానుసారముగా కిష్కింధా రథయాత్రలో భాగముగా ప్రతిరాష్ట్రములో 108 శ్రీ కిష్కింధా హనుమద్ మూర్తుల ప్రతిష్ఠా కార్యక్రమములలో భాగముగా మొట్టమొదటిగా ప్రప్రథమముగా స్వర్ణహంపి గ్రామమునందే మెదటి శ్రీ కిష్కింధ హనుమతులవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము

3 రోజుల శిలాన్యాస శిలా పూజ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవములు విశేషముగా సంపన్నమైనవి

కిష్కింధా రథయాత్ర భక్తివైభవ విజయ యాత్ర లో భాగముగా మొట్టమొదట అయోధ్యా శ్రీ రామచంద్ర ప్రభువులవారి దర్శనమునకు అశీర్వాదమునకు అయోధ్యకు యాత్ర నూతన కిష్కింధా హనుమద్ సమేత శ్రీ సీతారామ లక్షమణుల దేవతా ఉత్సవమూర్తులతో

