
“ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠా” ఈ సమస్త సృష్ఠి దేనిపైన ఆధారపడి ఉన్నదో సమస్త ప్రాణూలు దేనిని ఆచరించిన వారి జీవనము జన్మ పరిపూర్ణము నొందునో ఈ సమస్త సృష్టి, స్థితి, లయములకు ఏదికారణమో మరియూ ఏది అనాదికాలముగా సమస్తమునూ సృజించి రక్షించుచున్నదో సమస్త ప్రాణులు ఏది ధరించుటకు యోగ్యమో దేని రక్షణకై భగవంతుడు అవతారములు పొందునో, అనాదికాలముగా ఆయా కల్పముల యందు, మన్వంతరముల యందు, యుగముల యందు, సమస్త జ్ఞానులు, ఋషులు, తపస్సంపన్నులు దేనిని ఆధారముగా చేసుకొని జీవించిరో, దేనిపైన సమస్త దేవతలు ప్రతిష్ఠితమై ఉన్నారో, ఏది త్రికాలములలో శాశ్వతముగా ఉండునో, సర్వమునకూ ఏది మూలమో ఆధారమో, కారణమో, దానినే సనాతనముగా సనాతన ధర్మముగా, వర్ణాశ్రమ ధర్మముగా అపౌరుషేయములైన వేదములు పేర్కొను చున్నవి, అట్టి సనాతన ధర్మములను ఆధర్మ ఆచరణ ధరించు శ్రేష్ఠ విధానములను, తత్ఫలితములను సకల మానవాళికీ తెలుపు నవి “శృతులు” వీటినే వేదములు అని అందురు వీటి ఆచరణను సమూలాగ్రముగా తెలియ జేయునవి స్మృతులు, ఈ ధర్మములనే ఇంకనూ ఇతిహాస ప్రమాణములతో భగవంతుని అనేక అవతార విశేషములతో, సత్పురుషుల, మహర్షుల జీవన ఇతిహాస విశేషముల తో తెలుపునవి ఇతిహాస పురాణ, దివ్య కావ్యములు సమస్తమూ ధర్మము పైనే ఆధారపడి ఉన్నవి ఆ సనాతన ధర్మము అనాది కాలము గా భూమండలం పైన సమస్త సనాతనులు ఆచరింప వస్తున్న ఆచరణ కర్మ ఆనుష్ఠానములకు మూల స్థానము ఈ భారత దేశము ఇటివంటి భారత దేశమున ఆ సనాతన ధర్మ పరిరక్షణకు భగవంతుడు ఆయా యుగములయందు ( మస్త్య కూర్మ ఆది వామన, పరశురామ, శ్రీరామ, శ్రీ కృష్ణ, కల్కి ఆది) అవతారములను ధరించి ధర్మ పరిరక్షణ చేసి సమస్త ప్రాణులను ఉద్దరించును ఆ భగవంతుని అవతారములయందు తాను అవతరించిన తన దివ్య లీలలను ప్రకటించిన, ఆ భగవంతుని లీలావతార విషేశములను దర్శించుటకై వేల సంవత్సరములుగా అనేక దేవతలు, ఋషులు తప్పస్సు చేసిన ఆభగవంతుని సేవకై, సేవలో తమ జీవితములను సార్థకము చేసుకొనుటకు అవతరించిన మహాభాగవతుల జన్మ స్థానములలో మోక్ష ధామములలో ప్రసిద్ధమైన శ్రీ అయోధ్యా, శ్రీ పంపాక్షేత్ర కిష్కింధా దివ్య ధామములు భగవంతుని నిత్య సన్నిధానమునకు అధ్యాత్మిక పుణ్య క్షేత్రములకు రాజధానులు దివ్య భగవత్- భక్తుల సంగమ క్షేత్త్రములు అటువంటి ధర్మ మూర్తి అయిన శ్రీ రామ చంద్రుని దివ్య జన్మస్థలము, మోక్షపురులలో ప్రప్రథమమైన మోక్షపురి “అయోధ్యా” క్షేత్రము, అటువంటి ధర్మమూర్తి భగవంతుడైన శ్రీ రామచంద్ర మూర్తి నిరంతర సేవలో తరించుటకై భగవద్ భక్తులలో స్రేష్ఠులు మహాభాగవతులలో అగ్రగణ్యులు ఐన శ్రీ పరమేశ్వరుని అంశతో, వాయువుని అనుగ్రహముతో, సూర్యాంశ తేజో సంభూతుడై కేసరీ అంజనాదేవి దంపతులకు శ్రీ పంపాసరోవరమున అంజనాద్రి పర్వతమున జన్మించిన దివ్య క్షేత్రము “పంపాక్షేత్ర కిష్కింధా” క్షేత్రము సనాతన ధర్మమునకు భగవంతుని నిత్య సాన్నిధ్యమునకు మూల సన్నిధానము భగవద్ భక్తుల దివ్య సంగమక్షేత్రము